HomeతెలంగాణTelangana Jagruthi | జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్​గా సంపత్ గౌడ్

Telangana Jagruthi | జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్​గా సంపత్ గౌడ్

- Advertisement -

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Telangana Jagruthi | తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్​గా లింగంపేట్​కు చెందిన ఎదురుగట్ల సంపత్ గౌడ్​ నియమితులయ్యారు. ఈ మేరకు జాగృతి అధ్యక్షురాలు కవిత (Jagruthi President Kavitha) ఈ నియామకాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా సంపత్​గౌడ్​ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆయన​ గతంలో సింగిల్ విండో ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్​గా, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​గా, జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా, గౌడ వసతిగృహం డైరెక్టర్​గా బాధ్యతలు నిర్వర్తించారు.

అలాగే జాగృతి మహిళా సమాఖ్య (Jagruti Women’s Federation) రాష్ట్ర కన్వీనర్​గా మరిపెల్లి మాధవి, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్​గా అప్పాల నరేందర్ యాదవ్, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ జనపాటి రాము యాదవ్, యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనర్​గా పరకాల మనోజ్ గౌడ్​ను నియమించారు.

Must Read
Related News