HomeసినిమాSamantha | ఆ జ్ఞాప‌కాలు మోయ‌లేక‌పోతున్నాను.. స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌

Samantha | ఆ జ్ఞాప‌కాలు మోయ‌లేక‌పోతున్నాను.. స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్ వైర‌ల్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samantha | టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు(Ruth Prabhu) తాజాగా చేసిన ఓ ఎమోషనల్‌ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తన జీవితంలోని అనుభవాలను, జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటూ స‌మంత ఎమోష‌న‌ల్ పోస్ట్ షేర్ చేయ‌గా, అది నెటిజన్ల మనసులను తాకుతుంది. సమంత(Heroine Samantha) గతంలో మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె, తన ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ పెట్టింది. ఆ దశలో ఎదురైన బాధలు, ఒత్తిడులు ఆమెను చాలా విషయాల్లో మారేలా చేశాయి. ఇప్పుడు మళ్ళీ సినిమాలపై దృష్టి సారించిన ఈ టాలెంటెడ్ బ్యూటీ, తన లోని మార్పును సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Samantha | ప్రేమ గురించి ఎవ‌రు చెప్ప‌లేదు..

“రీసెంట్‌గా నేను నా మేకప్ ఆర్టిస్ట్‌తో చాలా విషయాలు చర్చించాం. అప్పుడు ఓ విషయం స్పష్టమైంది. ముప్పై ఏళ్ల తర్వాత మనం ప్రపంచాన్ని చూసే తీరు మారిపోతుంది. అందం, వయసు, వెలుగు అన్నింట్లోనూ మార్పు వస్తుంది. అందుకే జీవితాన్ని ఇరవైలలోనే ఆస్వాదించాలి. కానీ నేను అప్పుడు విజయాల కోసం మాత్రమే పరుగులు పెట్టాను. నన్ను నేను పూర్తిగా కోల్పోయాను” అంటూ ఆమె పేర్కొంది. నిజమైన ప్రేమ మనలోనే ఉంటుంది. బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ప్రేమించుకోవడమే అసలైన ప్రేమ అని నేర్చుకున్నా. ఇప్పుడు ముప్పైల్లో ఉన్న నేను, పూర్తిగా కొత్త ఆలోచనా విధానంతో ముందుకు సాగుతున్నా. ప్రతి అమ్మాయి ఇలా ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో జీవించాలి. అప్పుడే ఆనందాన్ని నిజంగా ఆస్వాదించగలుగుతారు అంటూ ఆమె తన పోస్ట్‌ను ముగించింది.

సమంత ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్‌ పెంచింది. “ఫ్యామిలీ మ్యాన్ 2”, “సిటాడెల్: హానీ బన్నీ” వంటి ప్రాజెక్ట్స్‌లో నటించి, అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్ట్‌లపై ఆమె చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ పోస్ట్‌తో సమంతకు మద్దతుగా నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. “మీ మాటలు మాకు ప్రేరణగా నిలుస్తున్నాయి”, “మీరు మరింత బలంగా తిరిగి వస్తారు”, “మీ వాక్యాల్లో ఎంతో జ్ఞానం ఉంది” అంటూ మెచ్చుకుంటున్నారు.

Must Read
Related News