HomeUncategorizedSamantha | త‌న బాడీపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి గ‌ట్టిగా బ‌దులిచ్చిన స‌మంత‌

Samantha | త‌న బాడీపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి గ‌ట్టిగా బ‌దులిచ్చిన స‌మంత‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samantha | ప్ర‌ముఖ న‌టి స‌మంత (Samantha) ఎప్పుడైతే నాగ చైత‌న్య (Naga Chaitanya) నుండి విడాకులు తీసుకుందో అప్ప‌టి నుండి ఆమెపై ట్రోలింగ్ ఎక్కువ అవుతుంది. నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల విష‌యంలో మేజ‌ర్ మిస్టేక్ స‌మంత‌దే అయి ఉంటుంద‌ని కొంద‌రు జోస్యాలు చెప్పారు. చైతూ రెండో పెళ్లి చేసుకున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై ఎవ‌రు పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేయ‌లేదు కాని, స‌మంత ఈ మ‌ధ్య ద‌ర్శ‌కుడు రాజ్‌తో (Director Raj) క‌లిసి ఎక్కువ‌గా తిరుగుతున్న నేప‌థ్యంలో ట్రోల్ (Troll) చేస్తున్నారు. అలానే స‌మంత శ‌రీరాకృతి గురించి కూడా విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో సమంత సోషల్ మీడియాలో తన శరీరాకృతి గురించి వస్తున్న విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. తనపై వ్యక్తిగతంగా దాడి చేసే వారికి ఓ ఫిట్‌నెస్ సవాల్ విసిరారు.

జిమ్‌లో పుల్-అప్స్ చేస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేస్తూ, తాను ఎలా శ్రమిస్తున్నానో చూపించారు. ఈ వీడియోకి ఆమె ఆసక్తికరమైన క్యాప్షన్ జోడిస్తూ, “ముందు కనీసం మూడు పుల్-అప్స్ చేయండి. చేయలేకపోతే, దయచేసి నా గురించి చెత్తగా మాట్లాడకండి” అంటూ ట్రోల్స్‌కి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చింది. ఇటీవల ఓ అవార్డ్స్ ఈవెంట్‌కు (Award Event) హాజరైన సమంత, నటి శ్రీలీలతో (Sreelela) కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నెటిజన్లు కొంద‌రు సమంత బాగా సన్నబడ్డారని, అనారోగ్యంగా ఉందేమోన‌ని కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే సమంత తన ఫిట్‌నెస్ (Fitness) చూపిస్తూ, విమర్శకులకి గ‌ట్టిగా బ‌దులిచ్చింది.

సమంత గత కొన్ని సంవత్సరాలుగా మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్నారు. ఈ విషయాన్ని 2022లోనే స్వయంగా వెల్లడించారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇక వృత్తిపరంగా కూడా సమంత ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. ఆమె ఇటీవ‌ల నిర్మించిన చిత్రం శుభం (Subham Movie) చాలా పెద్ద విజ‌యం సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాజ్ & డీకే దర్శకత్వంలో రూపొందుతున్న రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌లో (Rakt Brahmand Web Series) నటిస్తున్నారు.ఇది చిత్రీకరణ దశలో ఉంది. అలానే ప‌లు క‌థ‌ల‌పై కూడా ఫోక‌స్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.