అక్షరటుడే, వెబ్డెస్క్: Samantha | సౌత్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ఇప్పుడు స్లో అయింది. సినిమాలు తగ్గించింది.. కానీ ఏదో ఒక విషయంతో నిత్యం వార్తలలో నిలుస్తూ ఉంటుంది.
ఆమె సోషల్ మీడియాలో (Social Media) పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతాయి. అంతే కాదు, ఆమె ఇంటర్వ్యూస్లో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తాజాగా NDTV వరల్డ్ సమ్మిట్ (World Summit) 2025లో సమంత చేసిన కామెంట్స్ సినీ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. ది న్యూ ఫేమ్” అనే సెషన్‌లో మాట్లాడిన సమంత తన వ్యక్తిగత కష్టాలు, ట్రోలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Samantha | ఎమోషనల్ కామెంట్స్..
ప్రామాణికతను చివరి గమ్యస్థానంగా ఎప్పుడూ భావించలేదని, ఇది ఒక ప్రక్రియ, పురోగతి అని చెప్పారు. తాను కంప్లీట్ పర్సన్ కాదు అని, తప్పులు చేసిన మెరుగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విడిపోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్, తీర్పులు గురించి కూడా స్పందించారు. యువత తమ మార్గదర్శకులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, అది వారి జీవితాన్ని మార్చగలదని సూచించారు. తన ప్రామాణికతను తన స్వంత ప్రయాణంతో ముడిపెట్టుకున్నట్లు చెప్పారు. తాను సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని అని చెప్పిన సమంత (Samantha), తన కుటుంబం ఆహారం పెట్టడానికి కూడా ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చారు. కీర్తి, సంపద తనకు ఒక లక్ష్యాన్ని కనుగొనే వరకు సృష్టించడానికి సంతోషపెట్టలేదంటూ సమంత పేర్కొంది.
ఇక సమంత ఇటీవల “శుభం” సినిమాతో నిర్మాతగా డెబ్యూ చేసి, మంచి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు తన సొంత బ్యానర్ “ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్”లో “మా ఇంటికి బంగారం” అనే సినిమాను నిర్మిస్తూనే నటిస్తున్నారు. అదేవిధంగా.. “రక్త్ బ్రహ్మాండ్” వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేస్తున్నారు. సమంత చెప్పిన వ్యాఖ్యలు, యువతకు ప్రేరణగా, వ్యక్తిగత పోరాటాలను ఎదుర్కొనే ధైర్యాన్ని అందిస్తున్నాయి. సమంత ప్రామాణికత, కష్టం, సమర్ధత వంటి అంశాలను తన ప్రయాణంలో చూపిస్తూ, అభిమానులకు కొత్త దిశనూ చూపిస్తున్నారు. సమంత వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.