Samantha
Samantha | తానా 2025 వేదికపై క‌న్నీళ్లు పెట్టుకున్న‌ సమంత.. ఈ రోజు కోసం 15 ఏళ్లు ఎదురు చూశా

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Samantha | అమెరికాలోని డెట్రాయిట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)TANA 2025 మహాసభల్లో ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు (actress Samantha Ruth Prabhu) ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో తన అభిమానుల ముందు స్టేజ్‌పై మాట్లాడిన సమంత భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె ప్రసంగం అక్కడున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. స‌మంత మాట్లాడుతూ.. ఈ వేదికపై నిలబడి ధన్యవాదాలు చెప్పేందుకు నాకు 15 ఏళ్లు పట్టింది. నా తొలి సినిమా ఏ మాయ చేశావే నుంచే మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు. మొదటి నుంచీ నన్ను మీ ఇంటి అమ్మాయిలా ఆదరించారు. అందుకుగాను ఇప్పుడు కృతజ్ఞతలు తెల‌పాల‌ని అనిపిస్తుంది అని అన్నారు.

Samantha | స‌మంత‌ని ఓదార్చిన సుమ‌..

అమెరికాలోని తెలుగు ప్రజల ప్రేమకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మీరు ఎంత దూరంలో ఉన్నా… నా మనసుకు చాలా దగ్గరగా ఉన్నారు” అని చెప్పిన ఆమె ఆ సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల నిర్మాతగా మారిన సమంత, తన సొంత‌ బేనర్ ట్రాలాలాపై నిర్మించిన తొలి చిత్రమైన శుభం (Subham movie) గురించి కూడా వేదికపై ప్రస్తావించారు. ఈ చిత్రానికి అమెరికాలో మంచి స్పందన రావడం తనను ఉత్సాహపరిచిందని చెప్పారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా… అది మన తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది ముందుగా ఆలోచిస్తా అని పేర్కొన్నారు. ఓ బేబి చిత్రం అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్‌ సాధించిందని విన్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను,” అని చెప్పారు.

తన పట్ల, తన సినిమాల పట్ల అమెరికాలోని (America) తెలుగు ప్రజలు చూపుతున్న ప్రేమ మరువలేనిదని ఆమె పేర్కొన్నారు. ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి లోనై స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సమంతను, ఈ వేడుకకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న సుమ కనకాల దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఈ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్‌గా మారాయి. నాకు సొంతిల్లు తెలుగు. న‌న్ను మీ ప్రేమ, అభిమానం ఎప్పుడు హ‌త్తుకునేలా చేస్తుంటాయి అని ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది స‌మంత‌.