HomeUncategorizedSamantha - Raj | మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్న సమంత-రాజ్ నిడిమోరు .. రెండో పెళ్లికి హింట్...

Samantha – Raj | మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్న సమంత-రాజ్ నిడిమోరు .. రెండో పెళ్లికి హింట్ ఇదేనా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samantha – Raj | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి తాజాగా మరోసారి పెళ్లి గాసిప్‌లు హీటెక్కిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆమె బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Director Raj Nidimoru)తో ప్రత్యేకంగా టైమ్ గడుపుతోందన్న వార్తలు మీడియాలో బాగా హల్‌చల్ చేస్తున్నాయి.

ఇప్పుడు ఇవన్నీ కేవలం ఊహాగానాలు కాదు, నిజమే అనిపించేలా కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ వర్గాల ప్రకారం, సమంత-రాజ్ ఇద్దరూ ఓ ఇంట్లో కలిసి నివసిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, రాజ్ భార్య కూడా వారి మధ్య ఏదో జరుగుతోందన్న సూచనలతో సోషల్ మీడియాలో ఇన్‌డైరెక్ట్ పోస్ట్‌లు చేస్తూ వస్తోంది. అయితే ఇప్పటివరకు రాజ్ ఈ విషయంపై స్పందించింది లేదు.

Samantha – Raj | ఇలా హింట్ ఇచ్చిందా ?

ఇక రాజ్, సమంత(Heroine Samantha)కు ఎంతో దగ్గర వ్యక్తి అని, ఆమె కొత్తగా ప్రారంభించిన నిర్మాణ సంస్థ ‘శుభం’లో అతడి పాత్ర ఎంతో కీలకమని ఇండస్ట్రీలో అందరూ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో సమంత దుబాయ్‌లో డిజైనర్ క్రేషా బజాజ్(Designer Kresha Bajaj) ఫ్యాషన్ షోకు హాజరైంది. ఈ ట్రిప్‌కి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. “దుబాయ్ ట్రిప్‌ను ఒక్క నిమిషంలో చూపిస్తున్నా” అని చెప్ప‌గా, ఆ వీడియోలో సమంత ఓ వ్యక్తి చెయ్యి పట్టుకుని నవ్వుతూ కనిపించడం హాట్ టాపిక్ అయింది. ఆ వ్యక్తి రాజ్ నిడిమోరునే అని అభిమానులు గట్టిగానే నమ్ముతున్నారు. తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇలా హింట్లు ఇస్తోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఫ్యాన్స్ మాత్రం ఇది చూసి, “స‌మంత రెండో పెళ్లికి సిద్ధ‌మ‌వుతుంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సమంత నటనతో పాటు నిర్మాణ బాధ్యతల్లోనూ బిజీగా ఉండగా, వ్యక్తిగత జీవితం కూడా మరో మలుపు తిరగబోతోందా అనే ఆసక్తికర చర్చ మొదలైంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత రూత్ ప్రభు కెరీర్‌పైనే ఎక్కువ‌గా దృష్టి పెట్టింది. నటిగా మాత్రమే కాకుండా, ఇటీవల నిర్మాతగా ‘శుభం’ అనే చిత్రాన్ని నిర్మించి తొలి ప్ర‌య‌త్నంలోనే సక్సెస్ అయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు “మా ఇంటి బంగారం” అనే చిత్రంతో పాటు, ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది.