HomeసినిమాSamantha - Raj | నెట్టింట హాట్​టాపిక్​గా సమంత–రాజ్​ రిలేషన్​షిప్​.. డేటింగ్​ రూమర్స్​కు బలం చేకూరుస్తున్న...

Samantha – Raj | నెట్టింట హాట్​టాపిక్​గా సమంత–రాజ్​ రిలేషన్​షిప్​.. డేటింగ్​ రూమర్స్​కు బలం చేకూరుస్తున్న లేటెస్ట్​ ఫొటో..!

సోషల్ మీడియాలో సమంత–రాజ్ రిలేషన్‌పై అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. చాలామంది “వీరి కెమిస్ట్రీ చూస్తుంటే పెళ్లి వార్త దూరంలో లేదేమో” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరూ ఈ రూమర్స్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Samantha – Raj | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Heroine Samantha) రూత్ ప్రభు మళ్లీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. సినిమాలు తగ్గించినా.. ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.

తాజాగా సమంత – దర్శకుడు నిర్మాత రాజ్ నిడిమోరుతో ఉన్న కొత్త ఫొటో నెట్టింట వైరల్‌గా మారి డేటింగ్ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చింది. రీసెంట్‌గా సమంత తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ ‘సీక్రెట్ అల్కమిస్ట్’ (Secret Alchemist) ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సినీ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో సమంత టాప్‌లెస్ స్టైల్ డిజైనర్ డ్రెస్సులో మెరిసిపోయారు.

Samantha – Raj | ఇంత సాన్నిహిత్య‌మా?

అయితే, ఆ ఈవెంట్‌లో రాజ్ నిడిమోరుతో (Raj Nidimoru) సమంత క్లోజ్‌గా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ పిక్‌లో రాజ్ చేతిలో విస్కీ గ్లాస్ ఉండగా.. మరో చేత్తో సమంతను ఆలింగనం చేస్తున్నట్లు కనిపించడం అభిమానుల్లో చర్చకు దారితీసింది. “ఇది కేవలం స్నేహం మాత్రమేనా?” అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ పబ్లిక్ ఈవెంట్లు, వెకేషన్లు, పార్టీల్లో తరచూ కలిసి కనిపిస్తున్నారు. అంతేకాకుండా, సమంత స్వయంగా రాజ్‌తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో (Social Media) పంచుకోవడం కూడా అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

సమంత ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. “గత ఏడాదిన్నర కాలంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. రిస్క్‌లు నేర్చుకున్నాను, నా అంతరాత్మను విశ్వసించడం ప్రారంభించాను. ఇది కేవలం ఆరంభమే” అంటూ రాశారు. ఈ పోస్ట్‌తో పాటు వైరల్ ఫొటో షేర్ చేయడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. కాగా.. సమంత–రాజ్ నిడిమోరు కలిసి పలు ప్రాజెక్టుల్లో పనిచేశారు. ‘ది ఫ్యామిలీ మాన్ 2’ వెబ్‌సిరీస్‌ ద్వారా వీరి బాండ్ మొదలై, ఆ తర్వాత ‘సిటడెల్: హనీ బన్నీ’, అలాగే సమంత నిర్మించిన ‘శుభం’ సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి కూడా రాజ్ సహనిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’తో పాటు హిందీలో ‘రక్త్ బ్రహ్మాండ్‌’ వెబ్‌సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కెరీర్ పరంగా కొత్త దిశలో ముందుకు సాగుతున్న ఆమె వ్యక్తిగత జీవితంలోనూ కొత్త పేజీ ప్రారంభించిందని అభిమానులు అంటున్నారు.

Must Read
Related News