HomeUncategorizedSamantha | సమంతని పరుగులు పెట్టించిన ఫొటోగ్రాఫర్స్.. స్టాప్ గాయ్స్ అంటూ ఆగ్రహం

Samantha | సమంతని పరుగులు పెట్టించిన ఫొటోగ్రాఫర్స్.. స్టాప్ గాయ్స్ అంటూ ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Tollywood star heroine Samantha) ఈ మధ్య తెగ వార్తలో నిలుస్తోంది. నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల తర్వాత సమంత రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల నిర్మాతగా మారి శుభం(Shubham) అనే సినిమాతో మంచి సక్సెస్ కూడా అందుకుంది సమంత.

మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది సామ్. తాను ఓ జిమ్‌కి వెళ్లిన సందర్భంలో ఫొటోగ్రాఫర్లపై తీవ్ర అసహనం చూపిస్తూ వార్తల్లో నిలిచింది. ముంబయి బాంద్రా(Mumbai Bandra)లోని ఓ జిమ్‌కు సమంత వెళ్ళింది. వర్కౌట్స్ పూర్తి చేసుకొని బయటకు రాగా కారు అక్కడ లేదు.

Samantha : విసిగించారు..

కారు కోసం ఎదురుచూస్తూ ఫోన్‌లో మాట్లాడుతుండగా ఫొటోగ్రాఫర్లు ఒక్కసారిగా ఆమెని చుట్టుముట్టారు. ఇదంతా ఓ వీడియోలో రికార్డ్ అవుతూ ఉండటంతో సమంత తట్టుకోలేక “ఆపండ్రా బాబూ” అంటూ హిందీలో విసుక్కుంది. కాసేపటి తర్వాత కారు రావడంతో సమంత ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి రాగా.. గుడ్ మార్నింగ్ సమంత మేడమ్ అని అక్కడివాళ్లు విష్ చేస్తూ మళ్లీ వీడియోలు తీశారు. అప్పటికే చిరాకుగా ఉన్న సమంత.. Stop it Guys అని విసుక్కుంటూ కారెక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఏం మాయ చేశావే’(Telugu film industry) చిత్రంలో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ఎన్నో సినిమాల్లో అద్బుతమైన పాత్రలు పోషించింది. ఇటు యాక్టింగ్, అటు గ్లామర్ కలబోసి యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా దగ్గరైంది. తన తొలి చిత్రంలో కలిసి నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన వీరి సంసారంతో ఒడుదుడుకులు మొదలై వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది.

ఈ షాక్‌తో కొంతకాలం పాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోగా.. ఆ తర్వాత ‘మయోసైటిస్’(‘Myositis) అనే వ్యాధి రావడంతో ఆమె కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ వ్యాధితో చాలా ఇబ్బంది పడిన సామ్.. కొన్నాళ్ల పాటు సినిమాలను పక్కనపెట్టేసి విదేశాలకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంది.