samantha
samantha

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (tollywood heroine samantha) ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. అందుకు కార‌ణం ఆమె నిర్మించిన శుభం మూవీ (shubham movie). న‌టి నుండి నిర్మాత‌గా (actress to producer) మారిన స‌మంత త‌న నిర్మాణంలో తొలిసారిగా శుభం అనే మూవీ తెర‌కెక్కించింది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో (shubham movie promotions) భాగంగా ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది. అయితే స‌మంత దుఖాన్ని దిగ‌మింగి అభిమానుల‌తో సంతోషంగా ఉండాల్సిన ఓ సంద‌ర్బం ఒ సారి ఎదురైంది. ఆ సంఘ‌ట‌న ఏంటంటే? స‌మంత తండ్రి (samantha father) చ‌నిపోయిన విష‌యాన్ని త‌ల్లి వెంట‌నే ఫోన్ చేసి చెప్పింది. ఆ మాట విన‌గానే స‌మంత ఒక్క‌సారిగా షాక్ అయింది.

samantha | ఎంత క‌ష్టం వ‌చ్చింది..

అయితే అప్ప‌టికే తండ్రితో కొంత కాలంగా స‌మంత (samantha) మాట్లాడ‌డం లేదు. దీంతో ఆ రోజు ఏం జ‌రుగుతుందో త‌న‌కి అర్దం కాలేదు. అప్పుడు ముంబైలో (mumbai) ఉండ‌గా, విష‌యం తెలిసి వెంట‌నే బ‌య‌ల్దేరింది. మ‌ధ్య‌లో చాలా మంది అభిమానులు తార‌స‌ప‌డ్డారు. ఫోటోలు కావాల‌ని అడ‌గ‌గా, వాళ్ల మాట కాద‌న‌క‌లేక న‌వ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చాను. లోలోప‌ల తండ్రి (father) చనిపోయాడ‌న్న దుఖం ఉబికి వ‌స్తున్నా? అదుపు చేసుకుని ఫోటోలిచ్చాను.. అభిమానులను బాధ పెట్ట‌డం ఇష్టం లేక ఆ రోజు అలా చేసిన‌ట్లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స‌మంత స్ప‌ష్టం చేసింది. అభిమానుల వ‌ల్లే నేడు ఈ స్థానంలో ఉన్న‌ట్లు గుర్తు చేసుకుంది సామ్.

స‌మంత తండ్రిని (samntha father) ఆంగ్లో ఇండియన్‌గా చెబుతూ వచ్చారు. కానీ జోసెఫ్‌ది తెలుగు స్టేట్ అట. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే జన్మించారట (born in andhra pradesh). ఇక్కడే పెరిగారట. ఆ తర్వాత ఫారెన్‌ వెళ్లారని, అట్నుంచి చెన్నైకి (chennai) వచ్చారని సమాచారం. సమంత తల్లి నైనిత్తే ప్రభు.. ఆమె మలయాళి. తండ్రి తెలుగు.. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుని చెన్నైలో సెటిల్‌ (settled in chennai) అయ్యారట. సమంతనే ఈ విషయం చెప్పడం విశేషం. సమంతకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారట. ఆమె చిన్న అమ్మాయి. తన అన్నల గురించి మాత్రం చెప్పలేదు. అయితే చెన్నైలో అమ్మా నాన్నలు ఓ స్కూల్‌ని నిర్వహించేవారట. ఫాదర్‌ మెయిన్‌గా చూసుకునేవాడట.