89
అక్షరటుడే, ధర్పల్లి: Dharpally SI | ధర్పల్లి ఎస్సైగా సామ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Dharpally SI | నిబంధనలు పాటించాలి
ట్రాఫిక్ నియమాలు (traffic rules) ప్రతిఒక్కరూ పాటించాలని.. బైక్‌లపై వెళ్లే వారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఎస్సై సూచించారు. సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలు బారిన పడకూడదని హెచ్చరించారు.