HomeUncategorizedRahul Gandhi | మీ ధైర్యానికి సెల్యూట్‌.. పాక్ బాధిత కుటుంబాల‌తో రాహుల్ భేటీ

Rahul Gandhi | మీ ధైర్యానికి సెల్యూట్‌.. పాక్ బాధిత కుటుంబాల‌తో రాహుల్ భేటీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Rahul Gandhi | పాకిస్తాన్(Pakistan) దాడిలో ఆప్తుల‌ను, ఆస్తుల‌ను కోల్పోయిన వారిని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ శ‌నివారం ప‌రామ‌ర్శించారు. జ‌మ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ప‌ర్యటించిన ఆయ‌న‌.. పాకిస్తాన్ దళాలు ఇటీవల జరిపిన సరిహద్దు కాల్పుల‌తో న‌ష్ట‌పోయిన బాధిత కుటుంబాలను కలిశారు. పూంచ్‌(Poonch)లో పాకిస్తాన్ కాల్పుల్లో దెబ్బతిన్న ఇళ్లను, నాలుగు రోజుల సైనిక ఘర్షణలో మరణించిన వారి కుటుంబాలను గాంధీ(Rahul Gandhi) ప‌రామ‌ర్శించారు. పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల్లో మరణించిన 12 ఏళ్ల కవలలు జోయా, జైన్ కుటుంబాన్ని ఆయన కలిశారు. పాకిస్తాన్ షెల్లింగ్‌లో తమ వారిని, ఇళ్లను కోల్పోయిన దుఃఖంలో ఉన్న కుటుంబాలను ప‌రామ‌ర్శించారు. వారి బాధలు విన్న ఆయ‌న‌.. పూంచ్‌లో తాను చూసిన విధ్వంసాన్ని ఆయన Xలో పోస్ట్ చేశారు. “ఈ రోజు నేను పూంచ్‌లో పాకిస్తాన్ షెల్లింగ్‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కలిశాను. ధ్వంస‌మైన‌ ఇళ్ళు, చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు, క‌న్నీటితో తడిసిన కళ్లను చూశాను.. ప్రియమైన వారిని కోల్పోయిన బాధాకరమైన కథలు విన్నాను. ఈ దేశభక్తిగల కుటుంబాలు ప్రతిసారీ ధైర్యం, గౌరవంతో యుద్ధ భారాన్ని మోస్తున్నాయి. వారి ధైర్యానికి సెల్యూట్, ”అని పోస్ట్ చేశారు.

Rahul Gandhi | వాణిని వినిపిస్తా..

బాధితుల‌తో మాట్లాడిన రాహుల్‌.. మీ స‌మ‌స్య‌ల‌ను జాతీయ స్థాయిలో లేవ‌నెత్తుతాని హామీ ఇచ్చారు. “బాధిత కుటుంబాలకు నేను గట్టిగా అండగా నిలుస్తాను – జాతీయ స్థాయిలో వారి డిమాండ్లు, సమస్యలను నేను ఖచ్చితంగా లేవనెత్తుతాను” అని ఆయన చెప్పారు. అనంత‌రం పాక్ షెల్ దాడుల్లో దెబ్బతిన్న పూంచ్‌లోని గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ(Gurdwara Shri Guru Singh Sabha)ను కూడా ఆయన సందర్శించారు.

Rahul Gandhi | కష్టపడి చదువుకోండి

పూంచ్‌లోని ఒక పాఠశాల(School)ను సందర్శించిన రాహుల్‌గాంధీ విద్యార్థులతో ముచ్చ‌టించారు. “మీరు ప్రమాదాన్ని, భయానక పరిస్థితిని చూశారు. కానీ చింతించకండి, ప్రతిదీ సాధారణ స్థితికి వస్తుంది. ఈ సమస్యకు మీరు స్పందించే విధానం ఏమిటంటే, మీరు చదువుకోవడం. నిజంగా కష్టపడి చ‌ద‌వ‌డంతో పాటు పాఠశాలలో చాలా మంది స్నేహితులను సంపాదించండ‌ని” అని విద్యార్థుల‌కు సూచించారు.