HomeUncategorizedAyodhya | అయోధ్య రామ్​పథ్​లో మద్యం, మాంసం విక్రయాలు బంద్​!

Ayodhya | అయోధ్య రామ్​పథ్​లో మద్యం, మాంసం విక్రయాలు బంద్​!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Ayodhya | అయోధ్యలోని రామ్​పథ్​లో మద్యం, మాంసం విక్రయాలు బంద్​ చేయాలని అయోధ్య మున్సిపల్​ కార్పొరేషన్​(Ayodhya Municipal Corporation) తీర్మానం చేసింది. అయోధ్యలోని కంటోన్మెంట్​, ఫైజాబాద్ ప్రాంతాలను కలిపే రామ్​ పథ్(Rampath)​ 14 కిలో మీటర్ల మేర ఉంటుంది. ఈ మార్గంలో మద్యం, మాంసం విక్రయాలు నిలిపి వేయాలని కార్పొరేషన్​లో తీర్మానం చేశారు. అంతేగాకుండా పాన్​, గుట్కా, బీడీ, సిగరెట్లు, లో దుస్తులతో కూడిన ప్రకటనలను కూడా నిషేధించాలని ప్రతిపాదించారు.

అయోధ్య మేయర్ గిరీష్ పాటి త్రిపాఠి(Ayodhya Mayor Girish Pati Tripathi) మాట్లాడుతూ, నిషేధానికి సంబంధించిన నిర్ణయాన్ని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్​కు తెలియజేశామన్నారు. దాని అమలుపై ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

అయోధ్య పట్టణంలో మాంసం, మద్యం అమ్మకాలు ఇప్పటికే నిషేధించారు. అయితే సరయు నది ఒడ్డున ప్రారంభమై ఫైజాబాద్ నగరంలోకి ప్రవేశించే రామ్ పథ్‌(Rampath)లో మటన్, చికెన్ దుకాణాలు అనేకం ఉన్నాయి. మాంసాహార హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో రాముడి పేరుతో ఉన్న మార్గంలో వీటి విక్రయాలు నిలిపి వేయాలని కార్పొరేషన్​లో తీర్మానం చేశారు.