NREGS Employees
NREGS Employees | ఉపాధి హామీ ఉద్యోగుల జీతాలు తగ్గింపు.. ఎందుకో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: NREGS Employees | ఉపాధి హామీ ఉద్యోగులకు (Employment Guarantee Employees) ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. ఔట్​ సోర్సింగ్​, ఒప్పంద ప్రతిపాదికన పని చేస్తున్న పలువురు ఉద్యోగుల జీతాలను తగ్గించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్​ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు (government employees) జీతాలు, డీఏలు పెంచుతారు. కానీ ఇక్కడ మాత్రం జీతాలు తగ్గించడం గమనార్హం. పలువురు ఉపాధి హామీ ఉద్యోగులకు ఇతర శాఖలతో పోలిస్తే భారీగా జీతాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించారు. వారి వేతనాలపై అభ్యంతరం చెప్పడంతో పంచాయతీ రాజ్​ శాఖ తాజాగా చర్యలు చేపట్టింది.

NREGS Employees | 12,055 మంది ఉద్యోగులు

ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) కింద రాష్ట్రంలో 12,055 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. వీరిలో ఒప్పంద ప్రాతిపాదికన 7,385 మంది ఫీల్డ్​ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. 900 ఔట్​ సోర్సింగ్​, 53 మంది తాత్కాలిక సిబ్బంది పని చేస్తున్నారు. హెచ్​ఆర్ విభాగంలో ఫిక్స్‌డ్‌ టెర్మ్‌ ఎంప్లాయీస్‌ (ఎఫ్‌టీఈలు) సంఖ్య 3,717గా ఉంది. అయితే వీరిలో కొందరికి ఇతర ప్రభుత్వ విభాగాల కంటే ఎక్కువ వేతనాలు అందుతున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. వారి జీతాలపై అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో సమీక్ష నిర్వహించిన పంచాయతీ రాజ్​ శాఖ పలువురి వేతనాలు తగ్గించింది. అంతేగాకుండా గరిష్ట వేతనాన్ని రూ.51 వేలుగా నిర్ణయించింది. తగ్గించిన జీతాలతో ఆ ఉద్యోగులను వచ్చే మార్చి వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.