అక్షరటుడే, వెబ్డెస్క్ : Heroine Sakshi Vaidya | సినీ ఇండస్ట్రీలో (Cinema Idustry) సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో.. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ హిట్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టమే. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న హీరోయిన్ సాక్షి వైద్య (Heroine Sakshi Vaidya), ఇప్పుడు మళ్లీ టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
కోవిడ్ కాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించిన సాక్షి, 2023లో అఖిల్ అక్కినేని సరసన నటించిన ‘ఏజెంట్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో (Director Surender Reddy) వచ్చిన ఆ స్పై యాక్షన్ మూవీ భారీ అంచనాలు పెంచినా, చివరికి దారుణ పరాజయం పాలైంది. అయితే సాక్షి గ్లామర్ లుక్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తర్వాత ఆమె మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించిన ‘గాండీవధారి అర్జున’ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. రెండు భారీ ఫ్లాపుల తర్వాత సాక్షి కెరీర్ ముగిసిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపించింది. అయితే తాజాగా ఆమెకు మళ్లీ టాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత, హీరో శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలో సాక్షి హీరోయిన్గా నటిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా, మరో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
ఇంతలోనే సాక్షికి మరో పెద్ద ఆఫర్ దక్కిందని సమాచారం. డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయమవుతున్న ‘అధీర’ అనే సూపర్ హీరో మూవీలో సాక్షిని హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారు. సాక్షికి ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా జరిగిందని, ఆమెను ఫైనల్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయట. ఇదే నిజమైతే, హనుమాన్ డైరెక్టర్ కథలో హీరోయిన్గా నటించే ఈ అవకాశం సాక్షికి టర్నింగ్ పాయింట్ అవ్వొచ్చు. ఈ రెండు సినిమాలు హిట్లు కొడితే, సాక్షి వైద్య టాలీవుడ్లో తిరిగి బిజీ హీరోయిన్గా మారడం ఖాయం. సాక్షి త్వరలో మలయాళంలో ‘హాల్’ అనే సినిమాతో పలకరించనుండగా, హిందీలోనూ ఒక సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.