HomeతెలంగాణOnline Betting | బెట్టింగ్​పై సజ్జనార్​ కీలక ట్వీట్​

Online Betting | బెట్టింగ్​పై సజ్జనార్​ కీలక ట్వీట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Online Betting | ఆర్టీసీ ఎండీ RTC MD సజ్జనార్ VC Sajjanar​ సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటారు. ఆన్​లైన్​ మోసాలు, బెట్టింగ్​లపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.

ఇటీవల తెలంగాణలో బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లపై కేసులు betting app case పెట్టడానికి కూడా ఆయన పెట్టిన పోస్టే కారణం. అయితే తాజాగా ఆయన ఎక్స్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు. సోదరా బెట్టింగ్​ జోలికి వెళ్లొద్దురా.. అంటూ ఇద్దరు మహిళలు పాడిన పాటను పోస్ట్​ చేసిన ఆయన ఆన్​లైన్​ బెట్టింగ్​లకు బలి కావొద్దని సూచించారు. బెట్టింగ్ అనేది ఒక విష వలయం అని, పెడుతున్న కొద్దీ డబ్బు పోతూనే ఉంటుందని వివరించారు. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న బెట్టింగ్​కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.