HomeతెలంగాణIPS Sajjanar | కామెడీ పేరుతో వెర్రి చేష్ట‌లా.. చ‌ర్య‌లు తీసుకుంటామంటూ స‌జ్జనార్ సీరియ‌స్

IPS Sajjanar | కామెడీ పేరుతో వెర్రి చేష్ట‌లా.. చ‌ర్య‌లు తీసుకుంటామంటూ స‌జ్జనార్ సీరియ‌స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPS Sajjanar | సోష‌ల్ మీడియా Social media వ‌చ్చినప్ప‌టి నుండి కొంద‌రు ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సాధారణ రీల్స్ ఎవరూ చూడరని.. వెరైటీగా వీడియో చేస్తూ విమ‌ర్శ‌ల పాల‌వుతున్నారు. కొంద‌రు అయితే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రీల్స్(Reels) వ‌ల‌న ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ యుగం కాబ‌ట్టి అరచేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను పిచ్చపిచ్చగా వాడేస్తున్నారు. కొందరు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అవుతుంటే.. మరికొంతమంది ఫేమస్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఫేమస్ అవ్వాలి అనే వెర్రి ఆలోచన తప్ప.. ఏం చేస్తున్నామనే జ్ఞానం లేకుండా పోతుంది.

IPS Sajjanar | సీరియ‌స్ వార్నింగ్..

ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఫేమస్ అయ్యేందుకు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. దూసుకొచ్చే రైళ్లకు ఎదురెళ్లడం, రోడ్లపై పడుకోవడం, పాములతో ఆడుకోవడం.. ఇలాంటి చర్యలతో ఎంతో రిస్క్ తీసుకుంటున్నారు. మ‌రి కొంద‌రు రీల్స్ Reels పేరుతో ఇత‌రుల‌కి ఇబ్బంది క‌లిగిస్తున్నారు. విధులకు ఆటంకం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ‌ర్ బస్సు కండక్ట‌ర్‌తో వెర్రి కామెడీ చేశాడు. దీనిపై స‌జ్జ‌నార్(Sajjanar) సీరియస్ అయ్యారు.

బ‌స్సు కండక్ట‌ర్‌(Bus Conductor)ని గుంటూరు పోతుందా అని అడిగాడు. పోదని చెప్ప‌డంతో చెప్పుని ఫోన్‌లా చెవు ద‌గ్గ‌ర పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ‌తాడు. ఇది స‌జ్జ‌నార్ దృష్టికి వెళ్ల‌డంతో ఆయ‌న సోష‌ల్ మీడియా(Social Media) ద్వారా వీడియో షేర్ చేస్తూ.. ‘సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైనా వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను(RTC Employees) ఇబ్బందులకు గురిచేస్తారా.. కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ(Police Department) సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చ‌రించారు.

Must Read
Related News