ePaper
More
    Homeక్రీడలుSaina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    Saina kashyap couple | ఇటీవ‌లే విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సైనా నెహ్వాల్.. మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నామంటూ పోస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Saina kashyap couple | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్ (Saina Nehwal), పారుపల్లి కశ్యప్ తాజాగా అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. విడాకుల ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఈ జంట మళ్లీ కలవాలని ప్రయత్నిస్తున్నట్టు సైనా స్వయంగా వెల్లడించారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో కశ్యప్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన సైనా, “కొన్నిసార్లు దూరం వల్ల విలువ తెలుస్తుంది. బంధాన్ని కొనసాగించేందుకు మేము మళ్లీ ప్రయత్నిస్తున్నాం” అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ఇది విన్న త‌ర్వాత వారి ఆనందానికి అవ‌ధులు లేవు.

    Saina kashyap couple | శుభ‌వార్త‌..

    గత నెలలో సైనా – కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు.”జీవితం కొన్ని సార్లు మనల్ని విభిన్న మార్గాల్లోకి తీసుకెళ్తుంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ప్రశాంతత కోసం ఇది అవసరం అనిపించిందంటూ సైనా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నారు. కానీ ఏమైందో ఏమో కాని మ‌ళ్లీ తిరిగి క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామంటూ గుడ్ న్యూస్ చెప్పింది సైనా నెహ్వాల్. కాగా, హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ (Gopi chand) బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతూ సైనా-కశ్యప్ మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం ప్రేమగా మారి, 2018లో వారు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సైనా – భారత బ్యాడ్మింటన్ చరిత్రలో అనేక ప‌త‌కాలు సాధించింది.

    READ ALSO  Chahal | న‌న్ను మోస‌గాడు అన్నారు.. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా.. ధ‌న‌శ్రీతో విడాకుల‌పై చాహ‌ల్ కామెంట్స్

    ఒలింపిక్స్ కాంస్యం సాధించిన సైనా, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. 2009లో అర్జున అవార్డు Arjuna Award, 2010లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, పలు ఇంటర్నేషనల్ టైటిల్స్, పతకాలు కూడా సాధించింది. కొంతకాలంగా గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ప‌డింది. గతేడాది ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించారు సైనా. 2023 జూన్‌లో చివరిసారి ప్రొఫెషనల్ సర్క్యూట్‌లో కనిపించిన ఆమె, త్వరలోనే తన కెరీర్‌పై స్పష్టత ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇక క‌శ్యప్.. ప్లేయర్ నుంచి కోచ్‌ దిశగా అడుగులు వేశారు. కాంపిటీటివ్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన పారుపల్లి కశ్యప్, ప్రస్తుతం కోచింగ్‌పై దృష్టిపెట్టారు.

    Latest articles

    Mahavatar Narsimha | చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ కొట్టిన చిత్రం.. బాక్సాఫీస్‌ దుమ్ములేపుతున్న ‘మహావతార్ నరసింహ’

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Mahavatar Narsimha | తెలుగు సినీ రంగంలోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, ప్రేక్షకుల...

    Kaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు...

    Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral video | సోష‌ల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు...

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​ – కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​ – కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line)...

    More like this