అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని బోర్గాం(పి)లోని సాయిశ్రీ మహాలక్ష్మి కాలనీవాసులు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిశారు. కాలనీలో శివాలయం నిర్మించాలని నిర్ణయించామని వివరించారు. ఇందుకు సహకారం అందించాలని కోరగా.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని కాలనీవాసులు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ కమిటీ సభ్యులు సాయరెడ్డి, అశోక్‌గౌడ్, రఘువరన్, చంద్రశేఖర్, వెంకటేశ్, రవీందర్, రణ్వీర్, అర్జున్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
