- Advertisement -
Homeజిల్లాలునిజామాబాద్​Guinness World Record | నృత్య ప్రదర్శనలో సాయిసహస్రకు ‘గిన్నిస్‌’ సర్టిఫికెట్‌

Guinness World Record | నృత్య ప్రదర్శనలో సాయిసహస్రకు ‘గిన్నిస్‌’ సర్టిఫికెట్‌

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్‌: Guinness World Record | నిజాంసాగర్ మండలంలోని మల్లూరుకు చెందిన సాయిసహస్ర గిన్నిస్​ వరల్డ్​​ రికార్డులో పేరు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. బాలిక గతంలో గిన్నిస్‌ రికార్డు సాధించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొంది. దీంతో తాజాగా ఆమెకు ప్రతినిధులు సర్టిఫికెట్‌ అందజేశారు.

2023, డిసెంబర్‌ 24న హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో(Gachibowli Stadium) భారత్‌ ఆర్ట్‌ అకాడమీ (Bharat Art Academy) ఆధ్వర్యంలో నిర్వహించిన రికార్డుస్థాయి కూచిపూడి నాట్యంలో (Kuchipudi dance) సాయిసహస్ర పాల్గొంది. కాగా.. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన అవార్డు అందజేత కార్యక్రమంలో సర్టిఫికెట్‌ అందుకుంది. సహస్రను తల్లిదండ్రులు కుమ్మరి శ్రీలత, నాగరాజుతో పాటు పలువురు అభినందించారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News