అక్షరటుడే, వెబ్‌డెస్క్ : M.S. Subbulakshmi | ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ జోరుగా సాగుతోంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించేందుకు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే కర్ణాటక సంగీతానికి ‘రాణి’గా గుర్తింపు పొందిన, భారతరత్న పురస్కారం అందుకున్న తొలి సంగీత కళాకారిణి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) నిర్మించనున్నట్లు సమాచారం. అలాగే ‘జెర్సీ’, ‘కింగ్డమ్’ వంటి విభిన్నమైన సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Director Gautham Tinnanuri) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
M.S. Subbulakshmi | ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవి?
ఈ కాంబినేషన్‌తో తెరకెక్కనున్న సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ బయోపిక్‌లో అత్యంత కీలకమైన ప్రశ్న… ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను ఎవరు పోషిస్తారు? అన్నదే. తాజా సమాచారం ప్రకారం.. సహజమైన నటన, భావోద్వేగాలను హృదయాన్ని తాకేలా వ్యక్తీకరించే నటి సాయి పల్లవి (Actress Sai Pallavi) ఈ పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది. తన అద్భుతమైన హావభావాలు, పాత్రలో పూర్తిగా లీనమయ్యే నైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి, సుబ్బలక్ష్మి వంటి చారిత్రక వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించడానికి సరైన ఎంపికగా భావిస్తున్నారు. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి తన 10వ ఏటనే హెచ్.ఎం.వి. సంస్థ కోసం పాటలు పాడి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ‘సేవాసదన్’, అత్యంత ప్రజాదరణ పొందిన ‘మీరా సహా నాలుగు సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం కర్ణాటక సంగీతంలో శిఖరాగ్రాన్ని అధిరోహించి, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంగీతానికి విశేష గుర్తింపు తెచ్చారు.
1998లో ఆమెకు లభించిన భారతరత్న (Bharata Ratna) పురస్కారం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఈ అసాధారణ సంగీత ప్రయాణం, వ్యక్తిగత జీవితం, కళాత్మక విజయాలను ఈ బయోపిక్‌లో సమగ్రంగా చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘రామాయణం’ సినిమాలో సీత పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి, ఈ బయోపిక్‌లో నటిస్తే అది ఆమె కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. సున్నితమైన భావోద్వేగాలు, సంగీత ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రకు ఆమె సిద్ధమవడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. భారతీయ సంగీత చరిత్రలో ఒక అద్భుత అధ్యాయాన్ని వెండితెరపై చూడబోతున్నామని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.