అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Sai Dharam Tej | టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ (సాయి దుర్గ తేజ్) తన వివాహంపై చివరకు స్పష్టమైన ప్రకటన చేశారు. ఎంతోకాలంగా ఆయన పెళ్లి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్తను అందించారు.
తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ్, వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరుగుతుందని అధికారికంగా వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ.. “నాకు మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్పేందుకే తిరుమల వచ్చాను. కొత్త సంవత్సరం రానున్న నేపథ్యంలో ఆయన ఆశీస్సులతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
Sai Dharam Tej | కొత్త ఏడాదిలో..
ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా తన రాబోయే సినిమా ‘సంబరాల ఏటి గట్టు’ గురించి కూడా సాయి దుర్గ తేజ్ మాట్లాడారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. రోహిత్ కేపీ దర్శకత్వంలో (Director Rohit KP) రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించిందని, “అసుర సంధ్యవేళ మొదలైంది… రాక్షసుల ఆగమనం” అనే డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందని తెలిపారు.
సాయి ధరమ్ తేజ్ (Sai Durga Tej) పెళ్లి వార్తతో పాటు కొత్త సినిమా అప్‌డేట్స్ రెండు కూడా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించాయి. 2025 సంవత్సరం ఈ మెగా హీరోకి ప్రత్యేకంగా నిలవడం ఖాయం. కొద్ది రోజుల క్రితం తేజ్.. మీడియా అడిగిన పెళ్లి ప్రశ్నకు కాస్త భావోద్వేగంతో సమాధానం చెప్పారు. పెళ్లి తప్పకుండా జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రకటించే హక్కు నాదే. అప్పటి వరకు మీడియా స్నేహితులు దయచేసి అత్యుత్సాహం ప్రదర్శించకండి” అని తేజ్ అన్నారు. అలానే 2023లో మీడియా వల్ల బ్రేకప్ అయిందని కూడా అన్నారు. మీడియా వరుసగా నా ప్రేమ వార్తలు, పెళ్లి పుకార్లు రాయడంతో నా కాలేజ్ గర్ల్‌ఫ్రెండ్ తీవ్ర ఒత్తిడికి గురైంది. ఆమె ఆ కథనాలను తట్టుకోలేక విడిపోయిందని అన్నారు.
