HomeUncategorizedSai Dharam Tej | న‌న్ను కాపాడింది హెల్మెట్.. ద‌య‌చేసి అంద‌రూ ధరించండి.. ప్రజలకు సాయిధ‌ర‌మ్...

Sai Dharam Tej | న‌న్ను కాపాడింది హెల్మెట్.. ద‌య‌చేసి అంద‌రూ ధరించండి.. ప్రజలకు సాయిధ‌ర‌మ్ తేజ్ రిక్వెస్ట్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sai Dharam Tej | మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విష‌యం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలోకి జారుకున్న సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej)ను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. ఈ సమాచారం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకుని తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రమాద వార్త విని మెగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున తేజ్ చికిత్స పొందుతున్న మెడికవర్ హాస్పిటల్‌(Medicover Hospital)కు చేరుకున్నారు. మెరుగైన చికిత్స కోసం తేజ్‌ను అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ఎలాంటి అంతర్గత గాయాలు లేకపోవడంతో చికిత్స తర్వాత తేజ్ త్వరగానే కోలుకున్నాడు.

Sai Dharam Tej | తేజ్ జాగ్ర‌త్త‌లు..

జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబరు-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌(Sports bike)పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో తేజ్ మద్యం తాగలేదని తెలిసింది. రోడ్డు మీద ఇసుక బురద ఉండడం వల్ల బైక్ జారిపోయిందని, దీంతో తేజ్ రోడ్డు మీద పడి స్పృహ కోల్పోయాడు. ఛాతి, కుడి కన్నుపై, పొట్ట భాగంలో తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తేజ్‌కు క్లావికల్ ఫ్రాక్చర్(Clavicle fracture) అయింది. అయితే ఈ మ‌ధ్య సాయి ధ‌ర‌మ్ తేజ్ ముందుగా అంద‌రికి హెల్మెట్(Helmet) పెట్టుకోవాల‌ని సూచిస్తున్నాడు. తాను హెల్మెట్‌ పెట్టుకుని డ్రైవ్‌ చేయడం వల్లే ఒకానొక సమయంలో యాక్సిడెంట్‌ అయినా సేవ్ అయ్యానంటూ గుర్తుచేశారు. ఇక హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలంటూ కోరుతున్నాడు.

జూన్ 21న అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియం(Hyderabad LB Stadium)లో నిర్వ‌హించిన యోగా డే (Yoga Day) కౌంట్‌డౌన్ శుక్ర‌వారం క‌ల‌ర్‌ఫుల్‌గా మారింది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుడేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుల‌తో పాటు ప‌లువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు,పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు యోగాసనాలు వేశారు. ఇక ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన సాయి ధ‌రమ్ తేజ్ మాట్లాడుతూ.. అందరు బైక్స్ నడిపెట్టప్పుడు హెల్మెట్ పెట్టుకోండి.. దాని వాళ్లనే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను. ప్రపంచానికి మనం ఇచ్చిన గిఫ్ట్ యోగా.. ఆ గిఫ్ట్ ను మనం కూడా వాడుకోవాలి.. అందరు యోగా చేసి ఆరోగ్యంగా ఉండండి. ప్ర‌తిరోజూ త‌ప్ప‌క యోగా చేయాలి. త‌ప్ప‌క చేస్తారు క‌దా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.