137
అక్షరటుడే, బోధన్: ACP Srinivas | వాహనదారులు హెల్మెట్ ధరిస్తేనే భద్రత అని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan ACP Srinivas) అన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (Transport Department) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గురువారం బోధన్ పట్టణంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు.
ACP Srinivas | బరువు కాదు బాధ్యత..
ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్‌ను బరువు కాకుండా బాధ్యతగా భావించాలని తెలియజేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుందన్నారు. కార్యక్రమంలో బోధన్ ఆర్టీవో శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ, రూరల్ ఎస్సై మశ్చేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.