ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | ట్రాన్స్​ఫార్మర్లకు భద్రత​.. అధికారుల వినూత్న ఆలోచన

    Nizamsagar | ట్రాన్స్​ఫార్మర్లకు భద్రత​.. అధికారుల వినూత్న ఆలోచన

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | ఖరీఫ్ కోసం రైతులు పొలంపనుల్లో తలమునకలై ఉన్నారు. కానీ, ఇటీవల ట్రాన్స్​ఫార్మర్ల (Transformers) చోరీలు పెరుగుతుండడంతో వారిలో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులు, ట్రాన్స్​కో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాన్స్​ఫార్మర్లకు చుట్టూ ఇనుప గ్రిల్ తో వెల్డింగ్​ చేయిస్తున్నారు.

    ఎస్సై శివకుమార్​ (SI Shivakumar), విద్యుత్​ శాఖ సిబ్బంది (Electricity Department) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అచ్చంపేట శివారులో రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ను తెరవడానికి వీలు లేకుండా ఇనుప రాడ్లతో వెల్డింగ్​ చేయించారు. తద్వారా ఆయిల్​, కాయిల్స్​ చోరీని నివారించవచ్చని వారు పేర్కొన్నారు. మిగితా రైతులు సైతం తమ పొంటపొలాల వద్ద ఉన్న ట్రాన్స్​ఫార్మర్లను రక్షించేలా ఇలా చేయించుకుంటే చోరీలను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో లైన్​ ఇన్​స్పెక్టర్​ శీను, లైన్​మన్​ షేరు తదితరులున్నారు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...