Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: ఎస్పీ రాజేష్​ చంద్ర

Kamareddy SP | ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం: ఎస్పీ రాజేష్​ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా, న్యూ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నళ్లను మంగళవారం కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్యరెడ్డితో (ASP Chaitanya Reddy) కలిసి పరిశీలించారు.

న్యూ బస్టాండ్ నుండి లింగంపేట్, ఎల్లారెడ్డి వైపు వాహన రాకపోకలు సాఫీగా సాగేలా ట్రాఫిక్ సిగ్నళ్లను (Traffic Signals) తనిఖీ చేశారు. ఇకపై వాహనదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ట్రాఫిక్ ఎస్సై మహేష్​కు సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత అని, సమిష్టి కృషితోనే ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

Kamareddy SP | ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలి

వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఎస్పీ సూచించారు. రాంగ్ రూట్, అశ్రద్ధగా డ్రైవ్ చేయడం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. డ్రంకన్​ డ్రైవ్‌పై కఠినచర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. అధిక వేగంతో డ్రైవ్ చేయకూడదన్నారు.

Kamareddy SP | సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..

సీసీ టీవీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ సాగుతుందని ఎస్పీ తెలిపారు. ముఖ్యమైన ట్రాఫిక్ ఉల్లంఘనలు, సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్​ఫోన్ వాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాష్ డ్రైవింగ్ లాంటివి చేస్తే వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు విధిస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఎస్సై నరేశ్​, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.