అక్షరటుడే, ఎల్లారెడ్డి: Safala Organic | తెలంగాణలోని ‘సఫల ఆర్గానిక్’ కంపెనీ సీఈఓ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి.. గత వారం జపాన్ పర్యటించారు. అక్కడి వ్యాపార, వాణిజ్య సంస్థల సీఈఓలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా, డాక్టర్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. భారత్‌లో, ముఖ్యంగా తెలంగాణ Telangana రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను సవివరంగా వివరించారు.
ఐటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి దిగ్గజ కంపెనీలు యోచిస్తున్నాయని తెలిపారు. పెట్టుబడుల ద్వారా శాస్త్ర సాంకేతిక, శ్రామిక శక్తి మార్పిడితో భారత్-జపాన్ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు.
Safala Organic | ఐచిన్ ప్రేఫ్చర్ గవర్నర్కు ఆహ్వానం
అనంతరం, డాక్టర్ ఎల్లారెడ్డి ఐచిన్ ప్రేఫ్చర్ గవర్నర్ హిదెకీ ఒమురా (Aichin Prefecture Governor Hideki Omura) ను తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో పర్యటించాలని కోరుతూ అధికారిక ఆహ్వాన లేఖను అందజేశారు. దీనికి గవర్నర్ ఒమురా సానుకూలంగా స్పందించారు.
గవర్నర్ హిదెకీ ఒమురా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో డాక్టర్ ఎల్లారెడ్డి చేస్తున్న విశేష సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డిని అసెంబ్లీ ఛైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టి అరుదైన గౌరవాన్ని అందించారు.
డాక్టర్ ఎల్లారెడ్డి తన బృందంతో కలిసి జపాన్ Japan లోని నగోయ రాష్ట్రంలో ఉన్న స్టార్టప్ సెంటర్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని టీ హబ్ సెంటర్ T Hub Center ను కూడా జపాన్ బృందం సందర్శించాలని ఆహ్వానించారు.
ఐచిన్ ప్రేఫ్చర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టయోటా మోటార్ Toyota Motor కంపెనీస్ ప్రధాన కార్యాలయానికి నిలయం. ఇది జపాన్ దేశంలో అత్యంత ధనిక రాష్ట్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.
ఈ భేటీలో అతుసుషి సవాడా (డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడ్ డివిజన్, ఐచి ప్రేఫ్చర్ గవర్నమెంట్ ఆఫ్ జపాన్), ఫ్యూమిహిర్ నంభు (వైస్ ఛైర్‌పర్సన్, ప్రేఫ్చర్ అసెంబ్లీ), తరో కవశీమ (ఛైర్‌పర్సన్, ఐచి ప్రేఫ్చర్ అసెంబ్లీ), కెన్జి తక్కుషిమా (ఇంటర్నేషనల్ అఫైర్స్ డివిజన్, ఐచి ప్రేఫ్చర్ గవర్నమెంట్ జపాన్) పాల్గొన్నారు.
