Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలి

Nizamabad Collector | సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలి

భూభారతిలో భాగంగా​ వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. తహశీల్దార్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | భూభారతి రెవెన్యూ సదస్సులో (Bhubharathi Revenue Conference) ఆన్​లైన్​ ద్వారా వచ్చిన సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్ నుంచి మంగళవారం తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) ద్వారా సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీశారు. పరిష్కారంలో అలసత్వ వైఖరి కనబరుస్తున్న పలువురు తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కఠిన నిర్ణయాలు తీసుకునే వరకు చూడవద్దని హెచ్చరించారు.

అర్హత కలిగిన ప్రతి దరఖాస్తుదారుడికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఒకవేళ ఏదైనా దరఖాస్తులు తిరస్కరణకు గురయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. అలాగే సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలకు (Sub-Collector and RDO offices)  పంపించే అర్జీలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. తదుపరి సమీక్ష నిర్వహించే నాటికి దరఖాస్తుల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి కనిపించాలని చెప్పారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.

Must Read
Related News