Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Yellareddy | పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎల్లారెడ్డి ఎస్సై మహేష్‌ అన్నారు. పట్టణంలో పోలీస్‌ కళాబృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎస్సై మహేష్‌ (SI Mahesh) అన్నారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం పోలీస్‌ కళాబృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా పోలీసు అమరవీరులను (police martyrs) స్మరించుకుంటూ కళాజాత బృందం ఆడి పాడారు. అలాగే, డయల్‌ 100, సైబర్‌ నేరాలు (Cyber Frauds), షీటీం సేవలపై వివరించారు. కార్యక్రమంలో కళాబృందం ఇన్‌ఛార్జి హెడ్‌ కానిస్టేబుల్‌ రామంచ తిరుపతి, శేషరావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, ప్రిన్సిపాల్‌ నాగేశ్వర్‌ రావు, తదితరులు పాల్గొన్నారు.