HomeUncategorizedMadhya Pradesh | సహజీవన భాగస్వామిని చంపి.. మృతదేహం పక్కనే రెండ్రోజులు గ‌డిపిన యువకుడు

Madhya Pradesh | సహజీవన భాగస్వామిని చంపి.. మృతదేహం పక్కనే రెండ్రోజులు గ‌డిపిన యువకుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Madhya Pradesh | చిన్న చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు ప‌డ‌డం, ఆవేశంలో చంపుకోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య కాలంలో చాలా చూస్తున్నాం. తాజాగా లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్న ఓ జంట మధ్య చోటుచేసుకున్న ఘర్షణ వల్ల ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన క‌ల‌క‌లం రేపుతుంది. మధ‍్యప్రదేశ్(Madhya Pradesh) రాజధాని భోపాల్‌(Bhopal)లో చోటుచేసుకున్న ఈ హత్యా ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సచిన్ రాజ్‌పుత్ (32) అనే యువకుడు గత నాలుగేళ్లుగా రితికా సేన్ (29) అనే యువతితో లివ్‌ఇన్‌ రిలేషన్‌(Live In Relationship)లో ఉండేవాడు. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్న సచిన్‌, ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రితికాపై తరచూ అనుమానాలు వ్యక్తం చేసేవాడట.

Madhya Pradesh | ఆవేశంతో..

ఈ అనుమానాలు ఘర్షణకు దారితీశాయి. జూన్‌ 27న వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో సచిన్ తను స‌హ‌జీవ‌నం చేస్తున్న భాగస్వామిని గొంతు నులిమి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత తాను చేసిన చర్యకు భయపడి, రితిక మృతదేహాన్ని దుప్పటితో కప్పి, రెండు రోజుల పాటు అదే గదిలో మద్యం తాగుతూ మృతదేహం పక్కనే నిద్రించాడు. అయితే.. జూన్‌ 29వ తేదీన మద్యం మత్తులో సచిన్ తన మిత్రుడైన అనూజ్‌కు ఈ విషయం చెప్పడంతో మర్డర్ విష‌యం బయటపడింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

రితికా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించగా, శరీరంపై గాయాల గుర్తులు, గొంతుపై నులిమిన గుర్తులు కనిపించాయని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికల(Forensic Reports) ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హత్య కేసు నమోదు చేసిన పోలీసులు సచిన్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై రితిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సహజీవన సంబంధాల పట్ల అవగాహన లోపం, ఆరోపణలు, అనుమానాలు చివరకు మరణం దాకా ఎలా తీసుకెళ్తాయో ఈ ఘటన తెలియ‌జేస్తుంది

Must Read
Related News