అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sabarimala Ayyappa Temple | మండల – మకరవిళక్కు వేడుకల నేపథ్యంలో శబరిమలలోని అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం (నవంబరు 16) తెరిచారు.
సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు కందరారు మహేశ్ నేతృత్వంలో అయ్యప్ప ఆలయ తలుపులు తెరిచారు. భక్తుల భద్రత, సౌకర్యాలను అధికారులు పర్యవేక్షించారు.
Sabarimala Ayyappa Temple | భక్తులకు అనుమతి..
ఆలయ ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి ప్రారంభ పూజను నిర్వహించారు. అనంతరం శ్రీకోవిల్ (గర్భగుడి) నుంచి తెచ్చిన జ్వాలతో 18 మెట్ల అధి (పవిత్ర మంట)ని వెలిగించారు.
సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు పూజారులు తలుపులు తెరిచి, భక్తులకు అయ్యప్ప దర్శనం కోసం అనుమతించనున్నారు.
