More
    Homeబిజినెస్​Amagi | సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన SaaS యూనికార్న్.. 3.41 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్

    Amagi | సెబీకి డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన SaaS యూనికార్న్.. 3.41 కోట్ల ఈక్విటీ షేర్ల ఓఎఫ్ఎస్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amagi | సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ సేవలు అందించే అమాగీ మీడియా ల్యాబ్స్ లిమిటెడ్ (Amagi Media Labs Limited) తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (initial public offering)కి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది.

    దీని ప్రకారం ఈ ఇష్యూ రూ. 1,020 కోట్ల పరిమాణంతో ఉండనుంది. తాజాగా షేర్లను జారీ చేయడంతో పాటు సెల్లింగ్ షేర్‌హోల్డర్లు 3,41,88,542 షేర్లను (3.41 కోట్ల షేర్లు) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో విక్రయించే విధంగా ఈ ఐపీవో ఉంటుంది. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 667 కోట్ల మొత్తాన్ని టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పెట్టుబడులు పెట్టేందుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది.

    సెల్లింగ్ షేర్‌హోల్డర్లలో పీఐ ఆపర్చూనిటీస్ ఫండ్ I, పీఐ ఆపర్చూనిటీస్ ఫండ్ II, నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్ X – మారిషస్, యాక్సెల్ ఇండియా VI (మారిషస్), యాక్సెల్ గ్రోత్ VI హోల్డింగ్స్ (మారిషస్) ట్రూడీ హోల్డింగ్స్, AVP I ఫండ్‌తో పాటు నిర్దిష్ట వ్యక్తిగత షేర్‌హోల్డర్లు ఉన్నారు.

    ప్రమోటర్లయిన భాస్కర్ సుబ్రమణియన్ (promoters Bhaskar Subramanian) (ఎండీ, సీఈవో), శ్రీవిద్య శ్రీనివాసన్ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), అరుణాచలం శ్రీనివాసన్ కరపట్టు (ప్రెసిడెంట్ – గ్లోబల్ బిజినెస్) ఈ సంస్థను 2008లో ప్రారంభించారు. ఇందులో యాక్సెల్, అవతార్ వెంచర్స్, నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ మొదలైనవి ఇన్వెస్ట్ చేశాయి.

    ఆదాయంపరంగా టాప్ 50 లిస్టెడ్ ‘మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్’ కంపెనీల్లోని (Media and Entertainment companies) 45 శాతం పైగా సంస్థలకు కంపెనీ సేవలందిస్తోంది. కంటెంట్ ప్రొవైడర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, అప్లికేషన్ల ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేయడంలో క్లౌడ్ టెక్నాలజీతో (cloud technology) సాంకేతిక సహకారం అందిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అమాగీ రూ. 1,162 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కొత్త కస్టమర్లతో పాటు ప్రస్తుత కస్టమర్లు తమ ప్లాట్‌ఫాంను విస్తృతంగా వినియోగించుకుంటున్న నేపథ్యంలో 2023-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో 30.70 శాతం వార్షిక వృద్ధిని సాధించింది.

    More like this

    Gandhari Mandal | తెల్లవారుజామున ఆలయంలో చోరీ : కేసు నమోదు చేసిన పోలీసులు

    అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | మండల కేంద్రంలోని నారాయణగిరి కొండపై కొలువైన శివభక్త మార్కండేయ ఆలయంలో (Shiva...

    ACB Case | విద్యుత్​ శాఖ ఏడీఈ అంబేడ్కర్​ అరెస్ట్​.. రూ.300 కోట్ల ఆస్తుల గుర్తింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | అక్రమాస్తుల కేసులో ఏసీబీ (ACB) అధికారులు విద్యుత్​ శాఖ ఏడీఈ...

    Bheemgal Mandal | చిన్నారులకు పోషకాహారం అందించాలి

    అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Mandal | చిన్నారులకు మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని ఐసీడీఎస్‌ సీడీపీవో స్వర్ణలత (ICDS...