అక్షరటుడే, వెబ్‌డెస్క్: South Africa : గత కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్) టోర్నీలో సీనియర్ ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకోవడం మనం చూశాం.
అయితే ఈ టోర్నీ మొత్తం అందరి దృష్టిని ఒకే ఒక్క ఆటగాడు ఆకర్షించాడు. అతను మరెవరో కాదు మిస్టర్ 360 డివిలియర్స్(De Villiers). 41 ఏళ్ల వయస్సులో వరుస సెంచరీలతో అదరగొట్టాడు. ఫైనల్లో కూడా సెంచరీ చేసి తన జట్టుకి కప్ అందించాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్‌పై విజృంభించిన సౌతాఫ్రికా లెజెండ్స్, టోర్నమెంట్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇదే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 టైటిల్‌ను ఆసీస్‌పై గెలిచి దక్కించుకున్న సౌతాఫ్రికా, ఇప్పుడు తమ మాజీ క్రికెటర్ల పోరాటంతో మరో ట్రోఫీని దక్కించుకుంది.
South Africa : కప్ అందుకున్నారు..
సెమీఫైనల్‌కు భారత్ ఛాంపియన్స్ గైర్హాజరు కావడంతో నేరుగా ఫైనల్లోకి చేరిన పాకిస్తాన్ (Pakistan) ఛాంపియన్స్, సౌతాఫ్రికా జట్టుతో పోరాడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.షార్జీల్ ఖాన్ – 44 బంతుల్లో 76 పరుగులు (9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఉమర్ ఆమీన్ – 19 బంతుల్లో 36 పరుగులు (3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆసిఫ్ ఆలీ – 28 పరుగులు, కెప్టెన్ హఫీజ్ – 17, కమ్రాన్ అక్మల్ – 2 పరుగులు చేశారు. అయితే 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 16.5 ఓవర్లలోనే విజయాన్ని నమోదు చేసింది.హషీమ్ ఆమ్లా – 18 పరుగులు, ఏబీ డివిల్లియర్స్ Devilliers – కేవలం 60 బంతుల్లో 120 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్సర్లు), జేపీ డుమిని – 28 బంతుల్లో 50 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించారు. చివర్లో డుమిని ఒక ఫోర్, ఒక సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు.
2025 సంవత్సరాన్ని సౌతాఫ్రికా South Africa క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా మలుచుకుంటోంది. టెస్టు వరల్డ్ ఛాంపియన్‌షిప్ (Test World Championship)ను గెలుచుకొని, ఇప్పుడు లెజెండ్స్ ఫార్మాట్లోనూ విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా లెజెండ్స్ తమ సత్తాను మరోసారి రుజువు చేయగా, డివిల్లియర్స్ వన్ మ్యాన్ షో అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. సిరీస్ ఆద్యంతం అద్భుతంగా ఆడిన డివిలియర్స్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా దక్కాయి.