అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | సమాచార హక్కు చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని నిజామాబాద్ ఉత్తర మండల తహశీల్దార్ విజయ్కాంత్రావు (Tahsildar Vijaykanth Rao) పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉత్తర తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు అడిగిన సమాచారం ఇచ్చే బాధ్యత మనదేనన్నారు. నిర్ణీత సమయంలో సమాచారం ఇచ్చే విధంగా సిబ్బంది చూడాలన్నారు. చట్టంపై ఉద్యోగులందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గిర్దావర్ ప్రభాకర్, శ్యామ్యూల్, సీనియర్ సహాయకులు లత, లేఖ, తదితరులు పాల్గొన్నారు.