HomeUncategorizedMegastar Chiranjeevi | ప్ర‌తి సంవత్సరం మ‌రింత యంగ్‌గా మారుతున్నారు... మ‌హేష్‌కి చిరంజీవి స్పెష‌ల్ బ‌ర్త్...

Megastar Chiranjeevi | ప్ర‌తి సంవత్సరం మ‌రింత యంగ్‌గా మారుతున్నారు… మ‌హేష్‌కి చిరంజీవి స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | మహేష్ బాబు (Mahesh Babu).. ఆ పేరులోనే ఓ మ్యాజిక్ ఉంది. హాలీవుడ్ హీరోలని తలదన్నే హ్యాండ్సమ్ లుక్స్, పర్ఫెక్ట్ ఫిజిక్‌తో తెలుగు ప్రేక్షకుల (Telugu audiences) గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మ‌హేష్ బాబు. వయసు అన్నది కేవలం నంబర్ మాత్రమే అనే మాటకు అర్థం చెబుతున్నారు. ఏటేటా మరింత యంగ్‌గా మారుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఈ రోజు మ‌హేష్ బర్త్ డే కాగా, ఆయ‌న 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. 1975, ఆగస్టు 9న మద్రాసులో జన్మించిన ఘట్టమనేని మహేష్ బాబు, నటశేఖర కృష్ణ, ఇందిరా దేవి దంపతుల కుమారుడు. చిన్నతనం నుంచే షూటింగుల్లో పాల్గొంటూ సినిమాల ప్రపంచాన్ని దగ్గరగా చూశాడు.

Megastar Chiranjeevi | బ‌ర్త్ డే విషెస్..

4 ఏళ్ల వయసులోనే ‘నీడ’ (1979) అనే చిత్రంతో తెరపై కనిపించారు. అనంతరం ‘పోరాటం’, ‘శంఖారావం’, ‘బజారు రౌడీ’, ‘గూఢచారి 117’ వంటి సినిమాల్లో బాలనటుడిగా కనిపించి తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. 1999లో ‘రాజకుమారుడు’ సినిమాతో (Rajakumarudu Movie) హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంతోనే నంది అవార్డును దక్కించుకున్నారు. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కృష్ణ Krishna లాగే మహేష్ కూడా ప్రయోగాల్లో వెనుకడుగు వేయలేదు. ‘యువరాజు’లో ఓ బాబు తండ్రిగా కనిపించడం, ‘టక్కరి దొంగ’లో కౌబాయ్ పాత్ర, ‘నాని’, ‘1 నేనొక్కడినే’ వంటి ప్రయోగాత్మక సినిమాలు మ‌హేష్ స‌త్తాని తెలియ‌జేశాయి. కొన్ని ఫ్లాప్స్ ఉన్నా, తన మానియాతో భారీ ఓపెనింగ్స్ సాధించిపెట్టారు.

‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘గుంటూరు కారం’ వంటి బ్లాక్ బస్టర్లతో తిరుగులేని స్టార్ గా నిలిచారు. ప్రస్తుతం ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB 29 తో గ్లోబల్ స్టార్‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అయితే ఈ రోజు మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి (Mega star Chiranjeevi) స్పెష‌ల్ విషెస్ తెలియ‌జేశారు. తెలుగు సినిమాకి గ‌ర్వ‌కార‌ణ‌మైన మీరు అసాధార‌ణ ప్ర‌తిభ‌, ఆకర్షించే గుణంతో అశేష అభిమానుల‌ని సంపాదించుకున్నారు. అత్యున్న‌త శిఖ‌రాలు అందుకోవ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏటేటా మ‌రింత య‌వ్వ‌నంగా మారుతున్నారు. ఈ ఏడాది సంతోషం, విజ‌యంతో పాటు ఆనంద‌క‌ర‌మైన క్ష‌ణాల‌తో కూడిన సంవ‌త్సరం కావాల‌ని మ‌నస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిరు ట్వీట్ చేశారు.

Must Read
Related News