HomeతెలంగాణRythu Bharosa | మూడు ఎకరాల్లోపు అన్నదాతలకు రైతు భరోసా జమ

Rythu Bharosa | మూడు ఎకరాల్లోపు అన్నదాతలకు రైతు భరోసా జమ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | ప్రభుత్వం వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa)ను వేగంగా జమ చేస్తోంది. సోమవారం సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రైతు భరోసా పథకానికి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలిరోజు రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,349 కోట్లు జమ చేసింది. రెండో రోజు మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది.

ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో మంగళవారం మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఖాతాల్లో నగదు జమ అయింది. 10.45 లక్షల రైతుల రూ.1,551.89 కోట్లు జమ అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageshwara Rao) మాట్లాడుతూ.. రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుభరోసా జమ చేస్తున్నామని తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రాష్ట్రంలో తొమ్మిది రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు రోజుల్లో మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసింది. బుధవారం నాలుగు ఎకరాల్లో భూమి ఉన్న అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశం ఉంది. యాసంగి సీజన్​లో నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎకరాలతో సంబంధం లేకుండా అందరికి జమ చేస్తామని తెలిపింది.

Must Read
Related News