ePaper
More
    Homeఅంతర్జాతీయంRussia | భారత్​కు రష్యా బంపర్​ ఆఫర్​.. Su-57E విమానాలు అందించడానికి ఓకే..

    Russia | భారత్​కు రష్యా బంపర్​ ఆఫర్​.. Su-57E విమానాలు అందించడానికి ఓకే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Russia | భారత్​కు రష్యా (Russia) మరో బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. తన ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57E ను భారతదేశానికి సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ దేశం భారత్​ ముందు ప్రతిపాదన ఉంచింది. అంతేగాకుండా ఆ విమానాలను భారత్​లో తయారు చేసుకోవడానికి అనువుగా సాంకేతికత బదిలీ చేయడానికి కూడా ముందుకు వచ్చింది. అలాగే సుకోయ్​ 30 అప్​గ్రేడ్​ చేయడానికి ఓకే చెప్పింది.

    భారత్​కు రష్యా మిత్రదేశం. ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య మిత్రుత్వం నడుస్తోంది. ఈ క్రమంలో గతంలో కూడా రష్యా భారత్​కు అనేక ఆయుధాలు సరఫరా చేసింది. తాజాగా ఆపరేషన్​ సిందూర్ (Operation Sindoor)​ సమయంలో పాక్​ దాడులను తిప్పికొట్టిన ఎస్​–400 సిస్టమ్ (S-400)​ కూడా రష్యా నుంచి కొనుగోలు చేసిందే.

    Russia | ఆధునిక విమానాలు

    భారత్​ వద్ద ప్రస్తుతం రష్యా నుంచి కొనుగోలు చేసిన సుకోయి 30(su-30) విమానాలు ఉన్నాయి. ఇవి పాత తరానికి చెందినవి. దీంతో భారత్​ ఫ్రాన్స్​ నుంచి రాఫెల్​ యుద్ధ విమానాలను (Rafale fighter jets) కోనుగోలు చేసింది. అత్యంత ఆధునిక యుద్ధ విమానాల్లో రాఫెల్​ ముందు వరుసలో ఉన్నాయి. అయితే రష్యా కూడా ఆధునిక యుద్ధ విమానాలు తయారు చేసింది. Su-57E భారతదేశ సూపర్-30 జెట్‌ల కోసం ప్రణాళిక చేయబడిన కీలక సాంకేతికతలను కలిగి ఉంటుంది.

    రష్యా తన విమానాల సాంకేతికను భారత్​ అందించి హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. Su-57E విమానాలు అమెరికాకు చెందిన US F-35 కంటే తక్కువ అధునాతనమైనవిగా పరిగణిస్తున్నా.. ప్రస్తుతం ఉన్న యుద్ధ విమానాల్లో మెరుగైనవి. ఇవి భారత్​కు చేరితే భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుంది. MiG-21ల వంటి పాత విమానాలను ప్రస్తుతం ఐఏఎఫ్​ వదిలించుకుంటుంది. తేజస్ వంటి స్వదేశీ ప్లాట్‌ఫారమ్‌ల డెలివరీలో జాప్యం కారణంగా IAF తక్కువ ఫైటర్ స్క్వాడ్రన్ బలంతో పోరాడుతున్న సమయంలో Su-57E ప్రతిపాదన రావడం గమనార్హం.

    More like this

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....