HomeUncategorizedIran - Israel | అమెరికాకు రష్యా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Iran – Israel | అమెరికాకు రష్యా స్ట్రాంగ్‌ వార్నింగ్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Iran – Israel | ఇరాన్​–ఇజ్రాయెల్(Iran–Israel) మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతోంది. ఇరాన్​ అణుశక్తి గల దేశంగా అవతరిస్తే తమ ఉనికికే ప్రమాదం అని భావించిన ఇజ్రాయెల్​ జూన్ 13న ఆపరేషన్​ రైజింగ్​ లయన్​(Operation Rising Lion) పేరిట దాడులకు పాల్పడింది. దాదాపు 200 యుద్ధ విమానాలతో టెల్​అవీవ్(Tel Aviv)​ ఇరాన్​లోని అణు స్థావరాలు, ఆర్మీ కీలక అధికారులు, న్యూక్లియర్​ సైంటిస్టులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. దీంతో ఇరాన్​ కూడా ప్రతిదాడులకు దిగింది.

Iran – Israel | ఆ దేశాల ఎంట్రీ

ఇరాన్​–ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలో అలజడి నెలకొంది. మరోవైపు ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో రానురాను పరిస్థితి మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ(Iran Supreme Leader Khamenei)ని లొంగిపోవాలని ఆదేశించింది. ఇరాన్​(Iran)పై తాము దాడికి దిగుతామని పరోక్షంగా ట్రంప్​ హెచ్చరించారు. ఈ క్రమంలో రష్యా ఎంట్రీ ఇచ్చింది. అమెరికాకు రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌పై యుద్ధానికి దిగడం అత్యంత ప్రమాదకరం అని పేర్కొంది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా మిలటరీ జోక్యం చేసుకోవద్దని సూచించారు. చేసుకుంటే తర్వాతి పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయని రష్యా విదేశాంగ శాఖ హెచ్చరించింది.

Iran – Israel | ఆయుధాలు పంపిన అగ్రరాజ్యం

ఇరాన్​తో యుద్ధం నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్​(Israel)కు ఆయుధాలు సరఫరా చేసినట్లు సమాచారం. అమెరికా, జర్మనీ నుంచి మిలటరీ కార్గో విమానాలు టెల్​ అవీవ్​ చేరుకున్నాయి. ఇందులో ఆయుధాలు, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్​కు 14 మిలటరీ కార్గో విమానాలు వచ్చాయి.

Iran – Israel | క్లస్టర్​ బాంబులతో విరుచుకుపడిన ఇరాన్​

యుద్ధంలో ఇరాన్​ మొదటిసారి క్లస్టర్‌ బాంబులను(Cluster bombs) ఉపయోగించింది. బాలిస్టిక్‌ క్షిపణులకంటే పెను విధ్వంసాన్ని కలిగించే క్లస్టర్‌ బాంబులను వినియోగంచడంతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఇరాన్‌ క్షిపణులతో టెల్‌ అవీవ్‌, జెరూసలెం, హైఫా నగరాలు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్‌ వ్యాప్తంగా సైరన్లు మోగడంతో ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. మరోవైపు బీర్‌షెబాలోని సోరోకా ఆస్పత్రి(Soroka Hospital)పై ఇరాన్​ దాడి చేసింది.