Homeఅంతర్జాతీయంRussian President Putin | అమెరికాకు షాకిచ్చిన రష్యా.. కీలక ఒప్పందం రద్దు చేసిన పుతిన్​.....

Russian President Putin | అమెరికాకు షాకిచ్చిన రష్యా.. కీలక ఒప్పందం రద్దు చేసిన పుతిన్​.. అగ్రరాజ్యంలో మొదలైన అణు టెన్షన్‌..

అమెరికాకు రష్యా అధ్యక్షుడు పుతిన్​ షాకిచ్చారు. ఆ దేశంతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Russian President Putin | అగ్రరాజ్యం అమెరికాకు రష్యా (Russia) షాక్​ ఇచ్చింది. అగ్రరాజ్యంతో ఉన్న కీలకమైన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.

ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Russian President Putin) తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్​ అగ్రరాజ్యానికి షాక్​ ఇచ్చారు. ఆ దేశంతో ఉన్న ప్లుటోనియం ఒప్పందాన్ని (plutonium agreement) రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన చట్టంపై సంతకం చేశారు.

Russian President Putin | ఏమిటీ ప్లుటోనియం ఒప్పందం..

అమెరికా – రష్యాల (America – Russia) మధ్య 2000 సంవత్సరంలో ఈ ఒప్పందం కుదిరింది. దీనిని ది ప్లుటోనియం మేనేజ్‌మెంట్‌ అండ్‌ డిస్‌పొజిషన్‌ అగ్రిమెంట్‌ అంటారు. దీని ప్రకారం ప్రచ్ఛన్నయుద్ధం అనంతరం రష్యా తన వద్ద ఉన్న ప్లుటోనియంను అణ్వస్త్రాల తయారీ కోసం కాకుండా.. పౌర అణు విద్యుత్‌ కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు.

కాగా.. బరాక్​ ఒబామా (Barack Obama) అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అగ్రరాజ్యంతో రష్యా సంబంధాలు క్షీణించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ ఒప్పందం అమలును నిలుపుదల చేశారు. అయితే తాజాగా ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసుకుంటూ పుతిన్​ చట్టంపై సంతకం చేశారు.

Russian President Putin | అగ్రరాజ్యంలో టెన్షన్​

పుతిన్​ ప్లుటోనియం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో అమెరికాలో అణుటెన్షన్​ (Nuclear tension) మొదలైంది. రష్యా తిరిగి అణ్వాయుధాల తయారీ చేపడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌తో (Ukraine) యుద్ధం కొనసాగుతున్న సమయంలో తాజాగా రష్యా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దీంతో రష్యా మళ్లీ అణ్వాయుధ తయారీని వేగవంతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.