HomeUncategorizedCrude Oil | రికార్డు స్థాయిలో ర‌ష్యా చ‌మురు కొనుగోలు.. అమెరికా ఒత్తిళ్ల‌ను ప‌ట్టించుకోకుండా దిగుమ‌తి

Crude Oil | రికార్డు స్థాయిలో ర‌ష్యా చ‌మురు కొనుగోలు.. అమెరికా ఒత్తిళ్ల‌ను ప‌ట్టించుకోకుండా దిగుమ‌తి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Crude Oil | చౌక‌గా ల‌భిస్తున్న రష్యా చ‌మురును (Russian Oil) భార‌త్ స‌ద్వినియోగం చేసుకుంటోంది. త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుండ‌డంతో మాస్కో నుంచి భారీగా దిగుమ‌తి చేసుకుంటోంది. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేయవద్దని అమెరికా ఎన్ని ఒత్తిళ్లు తెస్తున్నా ఇండియా మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు.

గ‌తంలో కంటే ప్ర‌స్తుత నెల‌లో భారీగా దిగుమ‌తి చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Doanld Trump) విధించిన 50 శాతం సుంకాలతో పాటు ఇతర అమెరికన్ అధికారుల నిరంతర దాడులు భారత శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి కొనుగోళ్లు చేయాలనే నిర్ణయంపై దాదాపుగా ప్రభావం చూపలేదని డెలివరీలు సూచిస్తున్నాయి.

Crude Oil | రోజుకు 1.73 మిలియన్ బ్యారెళ్లు..

సెప్టెంబర్‌లో రష్యన్ ఓడరేవులలో ముడి చమురు (Crude Oil) లోడింగ్‌లు కూడా స్థిరంగా ఉన్నాయని ట్యాంకర్ డేటా, పరిశ్రమ అంతర్గత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సెప్టెంబర్ నెల‌లో అంటే గ‌త 16 రోజుల్లో ఇండియా రోజుకు 1.73 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును దిగుమతి చేసుకున్నట్లు లెక్క‌లు చెబుతున్నాయి. జూలై, ఆగస్టులో దిగుమతి వాల్యూమ్‌లు వరుసగా రోజుకు 1.59 మిలియన్ బ్యారెళ్లు, 1.66 మిలియన్ బ్యారెళ్లుగా న‌మోద‌య్యాయి. కానీ ఈ సెప్టెంబ‌ర్ మాసంలో మాత్రం రికార్డు స్థాయిలో రోజుకు 1.73 మిలియ‌న్ బ్యారెళ్లు దిగుమ‌తి అవుతున్నాయి.

Crude Oil | అమెరికా ఒత్తిళ్ల‌ను కాద‌ని..

ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు కొనుగోలు చేస్తుండ‌డాన్ని అమెరికా (America) స‌హించ‌డం లేదు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా చేస్తున్న యుద్ధానికి ప‌రోక్షంగా భార‌త్ స‌హ‌క‌రిస్తోందని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తుంద‌న్న కార‌ణాన్ని చూపి ఇండియాపై (India) సుంకాలు విధించారు. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. మ‌రోవైపు, ట్రంప్ స‌న్నిహితులు పీటర్ నవారో, స్కాట్ బెసెంట్‌తో సహా ప‌లువురు అగ్రశ్రేణి సహాయకులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Must Read
Related News