అక్షరటుడే, వెబ్‌డెస్క్: Russia | రష్యా కార్మిక కొరతతో సతమతమవుతోంది. ఉక్రెయిన్(Ukraine)తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశ పౌరులను మోహరించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కార్మిక కొరతను పరిష్కరించడంపై రష్యా(Russia) దృష్టి సారించింది.
ఈ సంవత్సరం చివరి నాటికి పది లక్షల మంది భారతీయ కార్మికులను నియమించుకోవాలని యోచిస్తోందని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధిపతి ఆండ్రీ బెసెడిన్(Andrei Besedin) తెలిపారు. “భారతదేశంతో ఒప్పందాలు కుదిరాయి. 2025 చివరి నాటికి స్వెర్డ్లోవ్స్క్ ప్రాంతంతో సహా భారతదేశం నుంచి ఒక మిలియన్ నిపుణులు రష్యాకు వస్తారు. వచ్చే భారతీయ కార్మికులకు(Indian Workers) వసతి కల్పించడానికి స్వెర్డ్లోవ్స్క్ రాజధాని యెకాటెరిన్‌బర్గ్‌లో కొత్త భారత కాన్సులేట్ తెరవబడుతుంది” అని ఆయన ఉటంకించారు.
Russia | కార్మికుల కొరతను పూడ్చుకునేందుకు..
రష్యాలోని స్వెర్డ్లోవ్స్క్ ప్రాంతంలోని మెటలర్జికల్, మెకానికల్ ఇంజినీరింగ్ కంపెనీ(Mechanical Engineering Company)లలో కార్మిక కొరత తలెత్తింది. ఈ కొరతను అధిగమించేందుకు భారతీయ కార్మికులు సహాయం చేస్తారని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ప్రధాన నగరమైన యెకాటెరిన్‌బర్గ్, ట్రాన్స్-సైబీరియన్ రైల్వే ద్వారా యూరప్, ఆసియాలను కలిపే ప్రధాన ఇన్‌ల్యాండ్ పోర్ట్, లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ కార్మికులతో పాటు, మాస్కో శ్రీలంక, ఉత్తర కొరియా నుండి కూడా నియమించుకోవాలని రష్యా యోచిస్తోంది అని బెసెడిన్ వివరించారు.