అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Attack on Indian students | రష్యా (Russia)లో విదేశీ విద్యార్థులపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు తీవ్రంగా గాయపడ్డారు.
రష్యాలోని ఒక వైద్య విశ్వవిద్యాలయం విదేశీ విద్యార్థుల హాస్టల్లో 15 ఏళ్ల బాలుడు దాడి చ ఏశారు. హోలోకాస్ట్‌కు సంబంధించిన జాతీయవాద నినాదాలు చేస్తూ కత్తితో దాడికి పాల్పడ్డాడు. రష్యాలోని బాష్కోర్టోస్తాన్ రిపబ్లిక్లో శనివారం జరిగిన ఈ కత్తిపోట్ల దాడిలో గాయపడిన ఆరుగురిలో నలుగురు భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. ఈ బాలుడు హింసాత్మక నయా-నాజీ సంస్థ అయిన నేషనల్ సోషలిజం / వైట్ పవర్‌కు చెందిన వాడని తెలిసింది. ఈ సంస్థను 2021లో రష్యా సుప్రీం కోర్టు ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
Attack on Indian students | రక్తంతో స్వస్తిక్ గుర్తు
దాడి అనంతరం నిందితుడు గోడపై స్వస్తిక్ గుర్తు గీశాడు. బాధితుల్లో ఒకరి రక్తంతో దానిని గీసినట్లు సమాచారం. నిందితుడు వసతి గృహంలో పలువురు విద్యార్థులను కత్తితో పొడిచాడని రష్యా అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే నిందితుడు వారిపై సైతం దాడి చేశాడు. అంతేకాకుండా తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.