అక్షరటుడే, హైదరాబాద్: RUSAL | అల్యూమినియం ఉత్పత్తిదారుల్లో ఒకటైన RUSAL సంస్థ, అల్యూమినియం స్క్రాప్‌ను శుద్ధి చేసి ఉన్నత-నాణ్యత గల అల్యూమినియాన్ని ఉత్పత్తి చేసేందుకుగాను విప్లవాత్మక సాంకేతికతను ఆవిష్కరించింది.
ఎలక్ట్రోలైసిస్ సాంకేతికత ద్వారా, కాలుష్యం ఎక్కువగా ఉన్న నాణ్యతలేని (off-grade) స్క్రాప్‌ను సైతం ప్రాథమిక అల్యూమినియం (primary aluminium) స్థాయికి సమానమైన లోహంగా మార్చవచ్చు. ఈ విధానంలో తక్కువ కార్బన్ పాదముద్ర కలిగి ఉండటం దీని ప్రత్యేకత.
RUSAL | అపరిశుభ్ర స్క్రాప్‌నకు కొత్త పరిష్కారం
సాధారణంగా, ఇనుము iron, రాగి copper వంటి మలినాలు ఎక్కువగా ఉన్న స్క్రాప్‌ను కరిగించే (melting) ఫర్నేస్‌లలో శుద్ధి చేస్తే.. దాని నాణ్యత తగ్గిపోయి (downcycling), ఉపయోగాల పరిధి తక్కువగా ఉండే తక్కువ-శ్రేణి లోహాలు మాత్రమే తయారవుతాయి.
అయితే, RUSAL పేటెంట్ పొందిన ఈ కొత్త ఎలక్ట్రోకెమికల్ శుద్ధి పద్ధతి ఈ సమస్యను పరిష్కరిస్తుంది. దీని ద్వారా లోహంలో నాణ్యత కోల్పోకుండా, P1020 గ్రేడ్ ఉన్న అత్యంత స్వచ్ఛమైన లోహాన్ని ఉత్పత్తి చేయగలగొచ్చు. ఇది ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఫుడ్ ప్యాకేజింగ్ వంటి హైటెక్ పరిశ్రమల్లో వినియోగించవచ్చు.
RUSAL | ఇంధన సామర్థ్యం, ఆర్థిక లాభం
RUSAL అభివృద్ధి చేసిన ఈ కొత్త పాట్ (pot) డిజైన్ తక్కువ ఖర్చుతో, అధిక శక్తి సామర్థ్యంతో స్క్రాప్‌ను ఎలక్ట్రోకెమికల్ పద్ధతిలో శుద్ధి చేస్తుంది.
లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (London Metal Exchange – LME) ధర కంటే తక్కువగా లభించే నాణ్యత లేని స్క్రాప్‌ను, LME ధరతో పాటు ప్రాంతీయ ప్రీమియం లభించే P1020 అల్యూమినియంగా మార్చడం ద్వారా కంపెనీకి ఆర్థికంగా కూడా లాభం చేకూరుతుంది.
పర్యావరణ అనుకూలత
- ఈ సాంకేతికతను 500 A, 3 kA సామర్థ్యం గల ప్రొటోటైప్ పాట్స్‌లో విజయవంతంగా పరీక్షించారు.
- అధిక స్వచ్ఛత: 99.7% కంటే ఎక్కువ స్వచ్ఛత కలిగిన అల్యూమినియం ఉత్పత్తి.
- స్థిరమైన ఉత్పత్తి: 40-45 రోజులు స్థిరంగా పనిచేసే ఆపరేషనల్ సైకిల్స్.
- అధిక శక్తి సామర్థ్యం: ఒక టన్ను అల్యూమినియం ఉత్పత్తికి కేవలం 9 MWh విద్యుత్తు మాత్రమే వినియోగం. (సాధారణ పద్ధతిలో అల్యూమినియం నుంచి లోహాన్ని కరిగించడానికి 12-14 MWh అవసరం).