అక్షరటుడే, ఇందల్వాయి: Mla Bhupathi Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubilee Hills by-election) ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి ప్రచారం చేశారు. ఈ మేరకు ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డితో కలిసి చేతి గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ఆయన వెంట డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ఐసీడీఎంఎస్ (IDCMS) మాజీ ఛైర్మన్ మునిపల్లి సాయరెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ మోహన్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్, మోపాల్ మండల యూత్ అధ్యక్షుడు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.