అక్షరటుడే, ఇందల్వాయి: Rural Mla Bhupathi Reddy| మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో (Yellareddy pally) గంగమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం రూ.40 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. అలాగే పూజారిని నియమించేందుకు దేవాదాయ శాఖకు (Endowment Department) విన్నవించినట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ డెలిగేట్ శేఖర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నవీన్ గౌడ్, నాయకులు చిన్న బాలరాజు, మోహన్, సంతోష్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.