అక్షరటుడే, భీమ్గల్: RUPP | రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ (Recognized Teachers and Scholars Parishad – RUPP) తెలంగాణ రాష్ట్ర యూనియన్ Telangana State Union తాజాగా నిజామాబాద్ జిల్లా Nizamabad District నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కేతటి చిదానంద రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా టి. ప్రమోద్ కుమార్ను నియమించింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సింహులు, శశి కుమార్ యాదవ్ తమ నియామకాలను ఖరారు చేసినట్లు చిదానంద రెడ్డి తెలిపారు.
RUPP | సమస్యల పరిష్కారమే ధ్యేయం
ఈ సందర్భంగా చిదానంద రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అన్ని విభాగాల భాషా ఉపాధ్యాయులకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులతో సామరస్యంగా ఉంటూనే, ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. జిల్లాలో యూనియన్ను మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.