Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | నగరంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్

Nizamabad City | నగరంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్

బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలో ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (District President Narala Sudhakar) డిమాండ్​ చేశారు. అష్టాంగ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమాన్ని (Run for Social Justice program) నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల ఉద్యమాన్ని నిలపడం ఎవరితరం కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు (central and state governments) 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తొమ్మిదిశాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు అమలుపరిచిన కేంద్ర ప్రభుత్వం 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా కిషన్, నగర అధ్యక్షుడు దేవేందర్, రవీందర్, శంకర్, అజయ్, చంద్రకాంత్, శ్రీలత, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News