Homeజిల్లాలుకామారెడ్డిMLA Madan Mohan | గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపండి: ఆర్టీసీ ఎండీకి ఎమ్మెల్యే వినతి

MLA Madan Mohan | గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపండి: ఆర్టీసీ ఎండీకి ఎమ్మెల్యే వినతి

ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మరిన్ని బస్సులు కేటాయించాలని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు కోరారు. ఈ మేరకు హైదరాబాద్​లోని బస్​భవన్​లో ఆర్డీసీ ఎండీని కలిశారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లట్లేదని.. ఆయా గ్రామాలకు బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే మదన్​మోహన్​ రావు (MLA Madan Mohan Rao) కోరారు. ఈ మేరకు మంగళవారం టీజీఎస్​ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని హైదరాబాద్ (Hyderabad)​లోని బస్​బవన్​లో కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బస్సుల కొరత, గ్రామీణ ప్రాంతాలకు తగిన సర్వీసులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గానికి కొత్త బస్సులను కేటాయించాలని.. ఎల్లారెడ్డి (Yellareddy) పట్టణంలో కొత్త ఆర్డీసీ డిపోను ఏర్పాటు చేయాలని కోరారు.

అలాగే గ్రామీణ మార్గాల్లో సర్వీసులను పెంచి.. ఫ్రీక్వెన్సీ మెరుగుపర్చాలని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఎల్లారెడ్డికి 10 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించినందుకు ఆర్టీసీ ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. స్పందించిన ఎండీ నాగిరెడ్డి (TGSRTC MD Nagi Reddy) ఎల్లారెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.