అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Naga Vamsi | తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సినిమా విజయంతో జీవితాలు మారిపోతుంటే, ఒక్క ఫ్లాప్‌తో నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో పడడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీకి (Naga Vamsi) సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
జెర్సీ, మ్యాడ్, సార్, లక్కీ భాస్కర్ లాంటి విజయవంతమైన సినిమాల్ని నిర్మించిన నాగవంశీ, ప్రేక్షకుల నాడి పట్టే నిర్మాతగా పేరుగాంచారు. అయితే బాలీవుడ్ యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన వార్ 2 (War 2 Movie) కోసం ఆయన పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు.
Naga Vamsi | తప్పుడు వార్తలు..
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సుమారు రూ. 90 కోట్లు (జీఎస్టీతో కలిపి రూ.105 కోట్లు) చెల్లించి దక్కించుకున్నట్టు సమాచారం. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేకపోవడంతో, నాగవంశీకి సుమారు రూ.50 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో “నాగవంశీ దివాళా తీశాడు, విల్లా అమ్మేసి దుబాయ్ వెళ్లిపోయాడు వంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలు ఎన్టీఆర్‌ని ద్వేషించే వాళ్లు, నాగ వంశీ అంటే పడని వారు పుట్టించారని అంటున్నారు.
నిజానికి నాగవంశీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని సినీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు మంచి లాభాలు తీసుకొచ్చాయి. “కింగ్డమ్ సినిమాతో నష్టం వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా అందులో నిజం లేదట. మరోవైపు వార్ 2తో నాగవంశీ కొంత నష్టపోయిన, ఆయన ఆర్ధిక పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమి లేదని అంటున్నారు . ప్రస్తుతం ఆయన మరో సినిమాతో తిరిగి లాభాల బాట పట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంతటితో ఈ తప్పుడు ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టాలని, నిజనిజాలను తెలుసుకోకుండా సోషల్ మీడియాలో (Social Media) ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం వలన పరిశ్రమపై నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశముంది అని అంటున్నారు.