అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ram Charan – Upasana | టాలీవుడ్‌లో సెలబ్రిటీ కపుల్స్‌లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జంట రామ్ చరణ్ – ఉపాసన. ఒకవైపు రామ్ చరణ్ సినిమాల్లో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతుంటే, మరోవైపు ఉపాసన కార్పొరేట్ రంగంలో తనదైన బ్రాండ్ ఇమేజ్‌ను ఏర్పరచుకున్నారు.
ఇద్దరూ తమ తమ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ, కుటుంబానికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడూ చాలా ప్రైవేట్‌గా వ్యవహరించడం ఈ జంట ప్రత్యేకత. వివాహం తర్వాత చాలా ఏళ్లకి తల్లిదండ్రులైన వీరు, తమ కూతురు విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆమె పుట్టి కొంతకాలం గడిచినా కూడా, చిన్నారి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగినా, ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించారు.
Ram Charan – Upasana | ఈ పిక్‌తో చెక్..
ఇదిలా ఉండగా, ఇటీవల ఉపాసన రెండోసారి గర్భం దాల్చిన విషయం కుటుంబ వర్గాల్లో ఆనందాన్ని నింపింది. సన్నిహితుల మధ్య సాంప్రదాయబద్ధంగా సీమంత వేడుకలు (Baby Shower Celebrations) కూడా నిర్వహించారు. ఈ సందర్భంలోనే కవల పిల్లలు రానున్నారని కుటుంబ సభ్యులే స్పష్టం చేయడంతో అభిమానుల్లో డబుల్ హ్యాపీనెస్ మొదలైంది. అయితే, ఈ ఆనందకరమైన వార్తకు తోడు కొన్ని అనవసర పుకార్లు కూడా సోషల్ మీడియా (Social Media)లో చక్కర్లు కొట్టాయి. ఉపాసన సరోగసీ మార్గాన్ని ఎంచుకున్నారనే కథనాలు హల్‌చల్ చేశాయి. అయితే, ఈ విషయంలో కుటుంబం ఎలాంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ఉండటమే గమనార్హం.
అయితే తాజాగా జరిగిన ఒక చిన్న కుటుంబ సమావేశం ఆ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టింది. మెగా కుటుంబ సభ్యుల ఇంట్లో నిర్వహించిన ప్రత్యేక విందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట కనిపించడంతో, అందులో ఉపాసన సహజంగా బేబీ బంప్ (Baby Bump)తో దర్శనమిచ్చింది. ప్రముఖ జపనీస్ చెఫ్ తకమాసా ఒసావా స్వయంగా వచ్చి వండిన బిర్యానీ విందులో రామ్ చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాల ద్వారా ఉపాసన గర్భధారణపై వచ్చిన అనవసర కథనాలకు అభిమానులు తమదైన విధంగా సమాధానం చెబుతున్నారు. మరికొన్ని నెలల్లో మెగా కుటుంబంలోకి ఇద్దరు కొత్త వారసులు రానున్నారన్న విషయం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది.