HomeసినిమాRukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరుతో మోసం.. అభిమానుల‌కు అస‌లు విష‌యం చెప్పిన క్యూట్...

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరుతో మోసం.. అభిమానుల‌కు అస‌లు విష‌యం చెప్పిన క్యూట్ బ్యూటీ

ప్రస్తుతం రుక్మిణి వసంత్ కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండి, సౌత్ సినీ రంగంలో అత్యంత క్రేజీ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు. ఆమె పేరుతో కూడా మోసాలు చేస్తుండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rukmini Vasanth | ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) వంటి పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి రుక్మిణి వసంత్. అయితే ఓ వ్య‌క్తి తన పేరును దుర్వినియోగం చేస్తూ చేస్తున్న‌ మోసంపై బహిరంగంగా హెచ్చరిక జారీ చేశారు.

ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె పేరుతో, స్వరాన్ని అనుకరిస్తూ పలువురిని సంప్రదిస్తున్నాడని తెలిపి, అలాంటి ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని అభిమానులకు సూచించారు. రుక్మిణి తన ఇన్‌స్టాగ్రామ్​లో (Instagram) అత్యంత ముఖ్యమైన హెచ్చరిక అనే శీర్షికతో ఒక ప్రకటన విడుదల చేశారు.

Rukmini Vasanth | ఆ నెంబ‌ర్ నాది కాదు..

ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 9445893273 అనే నంబర్‌ వాడుతున్న వ్యక్తి తాను రుక్మిణినని చెబుతూ తప్పుడు ఉద్దేశ్యాలతో పలువురిని సంప్రదిస్తున్నాడు. “ఆ నంబర్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ నంబర్‌ నుంచి వచ్చే కాల్స్ లేదా మెసేజ్‌లు పూర్తిగా నకిలీ. దయచేసి ఎవరూ వాటిని నమ్మవద్దు” అని ఆమె స్పష్టం చేశారు. అలాగే, ఈ ఘటనపై ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించామని కూడా రుక్మిణి వెల్లడించారు. “ఇలాంటి మోసపూరిత చర్యలు సైబర్ క్రైమ్ (Cyber Crime) పరిధిలోకి వస్తాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా సమాచారం కోసం నేరుగా నన్ను లేదా నా టీమ్‌ను సంప్రదించండి. ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండండి” అని ఆమె పేర్కొన్నారు.

రుక్మిణి (Rukmini Vasanth) పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవగా.. అభిమానులు ఆమెకు మద్దతుగా స్పందిస్తూ.. ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే, రుక్మిణి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ (#NTRNeel)లో నటిస్తున్నారనే వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చాట్‌లో పాల్గొన్న రుక్మిణి, దర్శకుడు ప్రశాంత్ నీల్​ను ఒక్క మాటలో వర్ణించమని అడిగితే “జీనియస్” అని సమాధానమిచ్చారు. మ‌రో అభిమాని “మీరు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నారా?” అని ప్రశ్నించగా.. ఆమె సరదాగా ..“ అయ్యో! ఈ సీజన్‌లో అందరికీ తెలిసిన రహస్యం ఇదే కదా? నేను చెప్పాల్సిన దానికంటే మీకే ఎక్కువ తెలుసనుకుంటా! ” అంటూ వ్యాఖ్యానించారు.

Must Read
Related News